ముదురుతున్న ఎండలు-నెల్లూరు(జి) గూడూరులో 41.2°C
అమరావతి: రాష్ట్రంలో ఎండల తీవ్రత క్రమేపీ పెరుగుతొంది.ఈ నేపధ్యంలో ఆదివారం 17 మండలాల్లో తీవ్రవడగాలులు, 32 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. అలాగే సోమవారం నుంచి 3రోజులపాటు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.భిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
శనివారం నెల్లూరు(జి) గూడూరులో 41.2°C తిరుపతి(జి) రేణిగుంటలో 41.1°C కృష్ణా(జి) పెద్దపారుపూడిలో 40.9°C చిత్తూరు(జి) నగరిలో 40.4°C మన్యం(జి) వీరఘట్టంలో 40.3°C విజయనగరం(జి) గుర్లలో 40.1°C

