ఎన్నికల నిర్వహణలో బూత్ లెవల్ అధికారుల పాత్ర కీలకం-కమిషనర్ వై.ఓ నందన్
నెల్లూరు: ఎన్నికల నిర్వహణలో బూత్ లెవెల్ అధికారుల పాత్ర కీలకమని నెల్లూరు సిటీ నియోజకవర్గం (117) ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అదికారి వై.ఓ. నందన్ పేర్కొన్నారు. గురువారం నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని బి.ఎల్.ఓ లకు నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ సమావేశ మందిరంలో శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. శిక్షణకు కమిషనర్ హాజరై బి.ఎల్.ఓ లతో మాట్లాడుతూ E.C.I ఆదేశాల మేరకు ఈ నెల 10,14,15,16,17 వ తేదీలలో నియోజకవర్గంలోని బి.ఎల్.ఓ లు అందరికి శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరు షెడ్యులు ప్రకారం బి.ఎల్.ఓ లకు కేటాయించిన తేది, సమయం ప్రకారం శిక్షణా కార్యక్రమానికి హాజరు కావాలని ఆదేశించారు. సచివాలయం సిబ్బందికి ఇటివల జరిగిన బదిలీలలో భాగంగా ఎవరైనా బదిలీ అయి ఉత్తర్వులు అందుకున్నప్పటికీ ఈ శిక్షణా కార్యక్రమానికి హాజరు కావాల్సిందేనని స్పష్టం చేశారు. శిక్షణలో అధికారులు తెలియజేసిన వాటిని శ్రద్ధగా విని, ఖచ్చితంగా ఆచరించాలని కమిషనర్ బి.ఎల్.ఓ లకు సూచించారు.బి.ఎల్.ఓ లకు ఎలాంటి సమస్యలున్నా, అనుమానాలున్నా తనతో పాటు, సంబంధిత అధికారులను నేరుగా సంప్రదించవచ్చని కమిషనర్ సూచించారు. ఈ సమావేశంలో ఏ.ఈ.ఆర్.ఓ షేక్ షఫీ మాలిక్, ఎన్నికల డిప్యూటీ తహసిల్దార్ వి.ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.