గురువులంటే భవిష్యత్ దిశను నేర్పించే వారు- కలెక్టర్
నెల్లూరు: రానున్న పది సంవత్సరాల కాలంలో విద్య వ్యవస్థలో వచ్చే మార్పులు దృష్టిలో ఉంచుకొని టీచర్లు తనుగుణంగా శిక్షణ పొందాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అన్నారు.శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని గురుపూజోత్సవ వేడుకల కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలిత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు బహికరించి జ్యోతి ప్రజ్వలన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎంపీ ఎస్( మోడల్ ప్రైమరీ స్కూల్) వ్యవస్థను విజయవంతంగా నడిపించే బాధ్యత టీచల్ పై వుందన్నారు. జిల్లాలో ప్రభుత్వ,, ప్రైవేటు స్కూలు యాజమాన్యాలు సమన్వయంతో పని పనిచేసే విద్యా వ్యవస్థలో మార్పులు తేవచ్చు అన్నారు. అందరూ మన పిల్లలు లేని భావించాలన్నారు. టీచర్లు నాణ్యమైన విద్యను బోధించే విధంగా తమ వంతు నిరంతర కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సురేష్‌రెడ్డి,తుడా ఛైర్మన్ శ్రీనివాసులరెడ్డి,జడ్పీ ఛైర్మన్ అరుణమ్మ,,తదితరులు పాల్గొన్నారు..కార్యక్రమం అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులను సముచిత రీతిలో సత్కరించి మెమెంటోలు బహుకరించారు,