DISTRICTS

హరనాథపురం సర్కిల్‌లో ‘సూర్య నమస్కార’ ప్రతిమల ఆవిష్కరణ-మంత్రి నారాయణ

రంగనాథుని పట్టువస్త్రాలు,టీ కొట్టు వద్ద మంత్రి,

నెల్లూరు: నగర సుందరీకరణలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. హరనాథపురం సర్కిల్‌లో ఏర్పాటు చేసిన అత్యద్భుతమైన ‘సూర్య నమస్కార’ ప్రతిమలను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ,రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్య సందేశాన్ని చాటిచెప్పేలా తీర్చిదిద్దిన ఈ విగ్రహాలు నగరానికి కొత్త శోభను తెచ్చాయి.. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు సిటీ మరియు రూరల్ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మేము అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నమని, ఈ క్రమంలోనే ముత్తుకూరు రోడ్డు సరిహద్దులో సూర్య నమస్కార విగ్రహాలు, వాటర్ ఫౌంటైన్,వాకింగ్ ట్రాక్‌తో కూడిన ఆధునిక పార్క్‌ ను త్వరలో ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు.

 రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం:- పెన్నా నదీ తీరాన వెలసిన ఉత్తర శ్రీరంగ క్షేత్రం, శ్రీ తల్పగిరి రంగనాథస్వామి వారి నవాహ్నిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి నారాయణ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గర్భాలయంలో రంగనాయక స్వామికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మంత్రి, లోక కల్యాణం కోసం,రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రార్థించారు. ఫిబ్రవరి 26 నుండి మార్చి 8 వరకు జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపాకటాక్షాలు పొందాలని, భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశామని మంత్రి ప్రకటించారు.

టీ కొట్టు వద్ద మంత్రి సందడి:- నగర పర్యటనలో భాగంగా ఎటువంటి బేషజాలు లేకుండా ఒక సామాన్య టీ కొట్టు వద్ద ఆగి, అక్కడ ఉన్న వారితో కలిసి వేడి వేడి టీ తాగుతూ సందడి చేశారు. కేవలం టీ తాగడమే కాకుండా, దుకాణదారుడి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ, “వ్యాపారాలు ఎలా ఉన్నాయంటూ ఆరా తీశారు.

ఈ కార్యక్రమంలో మేయర్ దేవరకొండ సుజాత,డిప్యూటీ మేయర్ రూప్ కుమార్, కమిషనర్ నందన్,తాళ్ళపాక అనురాధ, విజేత రెడ్డి, రాష్ట్ర నాయకులు గిరిధర్ రెడ్డి, స్థానిక టిడిపి ముఖ్య నేతలు నాయకులు, ఆలయ EO శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మేయర్ దేవరకొండ సుజాత, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పిటిసి విజేత రెడ్డి, ఆలయ EO శ్రీనివాసులు రెడ్డి,లెక్కల వెంకరెడ్డి అధికారులు తదితరులు స్థానిక టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *