DISTRICTS

పని చేసే ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపులు-రాష్ట్ర మహిళా కమీషన్ చైర్ పర్సన్

నెల్లూరు: పని చేసే ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపులు (నిరోధము, నిషేదము,పరిహారం )చట్టం,2013 పటిష్టంగా అమలుకు క్షేత్ర స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మహిళా కమీషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ తెలిపారు. బుధవారం కలెక్టర్ కార్యాలయములోని తిక్కన ప్రాంగణములో పని చేసే ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపులు (నిరోధము, నిషేదము,పరిహారం)చట్టం ,2013 పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన, అవగాహన కార్యక్రమ అనంతరం చైర్ పర్సన్ మాట్లాడుతూ పని చేసే ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపులు (నిరోధము, నిషేదము మరియు పరిహారం )చట్టం ,2013 క్షేత్ర స్థాయిలో అమలు పరచుటకు 10 మంది పైన పని చేస్తున్న మహిళా ఉద్యోగినులు ఉన్న చోట ఐ.సి.సి (ఇంటర్నల్ కంప్లయింట్ కామిట్) ఏర్పాటు చేయాలన్నారు. సదరు కమిటీ మెంబర్లకు యాక్ట్ అమలుపై సరియైన అవగాహన లేదని వారికి మరింత అవగాహన కల్పించవలసిన అవసరం ఉందన్నారు. జిల్లాలో సుమారు 256 కమిటీలు ఏర్పాటు చేయడం సంతోషదాయకం అన్నారు. ఐ.సి.సి కమిటీలు కేవలం కాగితాల మీద కాకుండా చట్టం పటిష్ట అమలుకు తగు చర్యలు తీసుకోవాలని అన్నారు.

జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మహిళల పట్ల దురుసుగా,అసభ్యంగా ప్రవర్తించడం శోచనీయమని, మహిళల పట్ల గౌరవంగా నడుచుకోవాలి అని తెలిపారు. ఈ కార్యక్రమములో రెవిన్యూ డివిజినల్ అధికారి అనుషా, మహిళా కమీషన్ సలాహాదారు సూయజ్, డ్వామా పిడి గంగా భావాని, జిల్లా అధికారులు, యూనివర్సిటి, ప్రయివేటు సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *