కూరగాయల మార్కెట్ రోడ్డు ఆక్రమణలను తొలగించండి-కమిషనర్ నందన్
ముగ్గురు సిబ్బందిపై తక్షణమే చర్యలు..
ఎట్టకేలకు నగరపాలక సంస్థ వాస్తవ పరిస్థితులకు దగ్గర వచ్చినట్లు కన్పిస్తొంది..రోడ్డును ఆక్రమించుకుని వేకువజామున 4 గంటల నుంచి ఈ రోడ్డులో ప్రయాణిచే వాహనదారులకు నరకం చూపిస్తున్నారు..ఈ తంతు సంవత్సరాల నుంచి జరుతున్న అధికారులు ఏ మాత్రం పట్టించుకున్న దాఖలు లేవు..ఎందు కంటే కార్పేషన్ సిబ్బంది రోడ్డును ఆక్రమించుకుని వ్యాపారం చేస్తున్న వారి వద్ద నుంచి ప్రతి రోజులు రూ.20 నుంచి రూ.30 ఆనధికారికంగా వసూలు చేస్తున్న చేస్తున్న విషయం బహిరంగ రహస్యమే..ఇందులో కొంత మొత్తం పై స్థాయి అధికారులకు అందుతున్నాయి అనేది కూడా బహిరంగ రహస్యమే..
2014లో నెల్లూరు జాయింట్ కలెక్టర్…..ఇక కూరగాయల మార్కెట్ లోపల అయితే కొలతల్లో దొపడి,రేట్లు,మహిళలను చూస్తే వెటకారమైన మాటలు….ఇలా చెప్పుకుంటు పోతే మరి ఎన్నో???…2014లో నెల్లూరు జాయింట్ కలెక్టర్ గా పని చేసిన రేఖారాణి,, కూరగాయల మార్కెట్ లోపలి వాతావరణంను ఒక దారికి తెచ్చింది..అటు తరువాత ఎంత మంది జాయింట్ కలెక్టర్లు వచ్చిన అటు వైపు చూసిన పాపాన పోలేదు..ఈ రోజు మాత్రం కమీషనర్ నగర ప్రజల ట్రాఫిక్ సమస్యపై స్పందించడం అభినందనీయు..
నెల్లూరు: నగరపాలక సంస్థ పరిధిలోని మద్రాస్ బస్టాండ్ ఎ.సి సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ ప్రాంగణం పరిసరాలలో రోడ్లను ఆక్రమిస్తూ వ్యాపారాలు నిర్వహిస్తూ, నిరంతరం ట్రాఫిక్ అంతరాయాలకు కారణంగా నిలుస్తున్న రోడ్డు మార్జిన్ దుకాణాలను తొలగించి, తిరిగి ఏర్పాటు చేయకుండా పర్యవేక్షించాలని కమిషనర్ వై.ఓ నందన్ శానిటేషన్ విభాగం అధికారులను ఆదేశించారు..
ముగ్గురు సిబ్బందిపై తక్షణమే చర్యలు:- పారిశుధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక ఏసి సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ పరిసర ప్రాంగణాలను కమిషనర్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కూరగాయల మార్కెట్ ప్రాంగణంలో పేరుకుపోయిన కూరగాయల వ్యర్ధాలు, అత్యంత అపరిశుభ్రంగా ఉన్న మార్కెట్ పరిసర ప్రాంతాలు, జనావాసాల మధ్యనే తిరుగుతూ, రోడ్లపై విశృంఖలంగా సంచరిస్తున్న పశువులను గుర్తించిన కమిషనర్ సంబంధిత ప్రాంతపు శానిటేషన్ విభాగం ముగ్గురు సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని MHOను ఆదేశించారు.
ఐదువేల రూపాయలుజరిమానా:- అదేవిధంగా బహిరంగ ప్రదేశాలలో వ్యర్ధాలు వేస్తున్న దుకాణదారులను గుర్తించి ఐదువేల రూపాయలు జరిమానాలను కమిషనర్ విధించారు. పెద్ద సంఖ్యలో వినియోగదారులు విచ్చేసే కూరగాయల మార్కెట్ ప్రాంగణాన్ని నిరంతరం అత్యంత పరిశుభ్రంగా ఉంచి పారిశుధ్య ప్రమాణాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలని దుకాణాదారులు, మార్కెట్ అసోసియేషన్ నిర్వాహకులను కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో అనూష, డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, అర్బన్ ఎమ్మార్వో షఫీ మాలిక్, నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ రామ్ మోహన్ రావు, సిటీ ప్లానర్ హిమబిందు,అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

