రేపటి నుంచి రామలింగపురం అండర్ బ్రిడ్జి 45 రోజుల పాటు మూసివేత
నెల్లూరు: రేపటి నుంచి (అగష్టు 15) రామలింగపురం అండర్ బ్రిడ్జి పనులు ప్రారంభము కానున్న సందర్బంలో 45 రోజులు పాటు అండర్ బ్రిడ్జిని పనుల కోసం మూసివేయడం జరుగుతుందని కార్పొరేషన్ ఇంజినీరింగ్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.. అండర్ బ్రిడ్జిలోని సిమెంట్ రోడ్డు పూర్తి పాడైపోవడంతో,, R&B డిపార్టుమెంట్ రూ.59 లక్షల రూపాయలతో నూతనంగా సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపట్టడడం జరుగుతుందని తెలిపారు..పోలీసు డిపార్ట్మెమెంట్ 45 రోజుల పాటు ట్రఫిక్ ను మళ్లిస్తారని తెలిపారు..రోడ్డు నిర్మాణం పూర్తి చేసి సెప్టంబరు నెల చివరి నాటికి రామలింగపురం అండర్ బ్రిడ్జి నుంచి ప్రజల రాకపోకలకు అందుబాటులోకి తీసుకుని వస్తారని,,నగర ప్రజలు ఇందుకు సహకరించాలని కోరారు.