కరుడు గట్టిన నేరస్తుడు గోని రాముపై PD యాక్ట్-ఎస్పీ అజిత
నెల్లూరు: నెల్లూరుజిల్లాను ప్రశాంతమైన జిల్లాగా ఉంచడమే తమ ధ్యేయమని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, నేర స్వభావాన్ని కొనసాగిస్తూ పదే పదే నేరాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని, పీడి చట్టం ప్రయోగిస్తామని జిల్లా ఎస్పీ అజిత్ హెచ్చరించారు. ఈ సందర్భంగా యస్.పి మాట్లాడుతూ, PD(ప్రివెంటివ్ డిటెన్షన్) యాక్ట్ అమలు చేస్తే జైలు జీవితం గడప వలసి వస్తుందని హెచ్చరించారు. అవసరమైతే జిల్లా బహిష్కరణ విధించడానికి కూడా వెనుకాడబోమని, చట్టరీత్య కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రౌడీ, KD, BC ల ప్రవర్తనలో మార్పు లేకుండా ప్రజాశాంతికి భంగం కలిగిస్తే వారిపైనా PD యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందన్నారు.
తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వుంటుంది:- ప్రతి నేరస్తుడిపై పటిష్ఠ నిఘా నిరంతరం ఉంటుందని, చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా వారిపై తక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నేర ప్రవర్తనను మానుకొవాలని లేకపోతే వస్తుందని రౌడీ షీటర్లు, పాత నేరస్థులు, చెడు నడత కలిగిన వారిని హెచ్చరించారు.మీ ప్రాంతాలలో ఏదైనా అసాంఘీకకార్యకలాపాలు జరిగితే వెంటనే సదరు సమాచారాన్ని పోలీస్ అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు….
పిడి యాక్ట్ ప్రయోగం:- గోని రాము(26) తండ్రి తిరుపాలు, కులం-మాల, వృత్తి: రౌడీయిజం, నివాసం: అంబేద్కర్ కాలనీ, వెంకటేశ్వరపురం, ప్రస్తుతము వుడ్ హౌస్ సంగం, నెల్లూరు సిటీ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. ఇతనిపై నవాబ్ పేట పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్ వుంది.. 2-హత్యలు,, 6- హత్యాయత్నం కేసులు, 2-దారి దోపిడీ, 2-దొంగతనం కేసులు, 3-రక్త గాయం చేసిన కేసులు, మొత్తం అతనిపై 15 నేరాల్లో ముద్దాయిగా ఉన్నాడు.