నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ ఉద్యోగి రాజారామ్ హిమనికి డాక్టరేట్
అమరావతి: శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం పరిశోధన విద్యార్థిని రాజారామ్ హిమనికి డాక్టరేట్ ప్రధానం చేసినట్లు డీన్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య అనురాధ ఒక ప్రకటనలో తెలిపారు. రాజారామ్ హిమని, డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ కాత్యాయిని మార్గదర్శకత్వంతో “స్టార్ట్ అప్ ఇండియా పాలసీ అండ్ విమెన్ ఎంట్రప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్”అనే అంశంపై పరిశోధన గ్రంథాన్ని సమర్పించారు. ప్రస్తుతం హిమని నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో వార్డ్ విద్యా-డేటా ప్రాసెసింగ్ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు.