రాష్ట్రంలో నెల్లూరుజిల్లా సెంట్రల్ జైలు ఆదర్శంగా నిలుస్తొంది-హోంమంత్రి అనిత
ఖైదీల్లో పరివర్తన వస్తొంది..
నెల్లూరు: రాష్ట్రంలో నెల్లూరుజిల్లా పోలీసులు,సెంట్రల్ జైలు సిబ్బంది ఆదర్శంగా నిలుస్తున్నరని హోం మంత్రి అనిత అన్నారు.శుక్రవారం నెల్లూరు సెంట్రల్ జైలుని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రౌడీ మూకల ఆటకట్టించాం. రప్పా… రప్పా… బ్యాచ్ లు చట్ట వ్యతిరక కార్యకలాపాలకి పాల్పడితే చర్యలు తప్పవు. అలాంటి వారి పట్ల నెల్లూరుజిల్లా ఎస్పీ, రౌడీయిజం చేసేవారిని బహిరంగంగా రోడ్లపై నడిపించి,రౌడీజంకు పాల్పపడితే కఠిన చర్యలు వుంటాయన్న సందేశం ఇవ్వడం మంచిదన్నారు. జైలులో ఉన్న ఖైదీలు పలు రకాల ప్రోడక్ట్స్ తయారు చేస్తు,నెలకు దాదాపు రూ.7 వేలు సంపాదిస్తున్నరని తెలిపారు. గత ప్రభుత్వం జైళ్లు, ఫైర్ శాఖల్లో నియామకాలు చేపట్టక పోవడంతో ఎక్కువ ఖాళీలు ఉన్నాయని,త్వరలోనే నియామకాలు చేపడుతామన్నారు.
