స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఉత్తమ ర్యాంకును సాధించాలి-నందన్
నెల్లూరు: నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక బోడిగాడి తోట ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన C ^& D ప్రాసెసింగ్ యూనిట్, వేస్ట్ టు కంపోస్ట్ యూనిట్ల నిర్వహణ పనితీరును అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరపాలక సంస్థ ఉత్తమ ర్యాంకును సాధించే దిశగా నూతనంగా ఏర్పాటు చేసిన యూనిట్లను సమర్ధవంతంగా నిర్వహించాలని కమిషనర్ సూచించారు.ఈ కార్యక్రమంలో సిటీ ప్లానర్ ఇంచార్జ్ రఘునాథరావు, అసిస్టెంట్ సిటీ ప్లాన్ వేణు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రఘురాం, పి ఎం యు టీం లీడర్ సాయి కృష్ణ, సచివాలయ కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు.

