కార్పొరేషన్ షాపులు సీలు వేసిన నగరపాలక సంస్థ అధికారులు
నెల్లూరు: నగరపాలక సంస్థకు చెందిన దుకాణాలకు సంబంధించి నెలవారీ బాడుగలు-రెన్యువల్ మొత్తాలు చెల్లించకపోవడం, అలాగే అసలు లీజుదారులు కాకుండా ఇతరుల ఆధీనంలో దుకాణాలు నిర్వహించబడుతున్న నేపథ్యంలో కమిషనర్ నందన్ ఆదేశాల మేరకు గురువారం చర్యలు తీసుకోవడం జరిగిందని కార్పొరేషన్ అధికారులు తెలిపారు. జే.వి.ఆర్. షాపింగ్ కాంప్లెక్స్, పాత డైకాస్ రోడ్డు,,ఏ.సి. బొమ్మ షాపింగ్ కాంప్లెక్స్‌లలో మొత్తం 6 దుకాణాలు మూసివేయడమైనది.
పాత డైకాస్ రోడ్డు:-షాప్ నం. 1 – రూ.3,25,000/- బకాయి…షాప్ నం. 3 – రూ.7,00,000/- బకాయి…షాప్ నం. 4 – రూ.38,000/- బకాయి…జే.వి.ఆర్. షాపింగ్ కాంప్లెక్స్:- షాప్ నం.16– రూ.7,38,975/- బకాయి…ఏ.సి. బొమ్మ షాపింగ్ కాంప్లెక్స్:-షాప్ నం. 3 – రూ. 8,63,712/- బకాయి…షాప్ నం. 4 – రూ.8,63,712/- బకాయి చెల్లించని కారణంగా సంబంధిత దుకాణాలు అధికారుల సమక్షంలో మూసివేయడం జరిగిందని పేర్కొన్నారు.

