వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు నారాయణ, ఆనం
నెల్లూరు: జిల్లా ప్రజలందరికీ విఘ్నాలను తొలగించే గణనాథుడు సకల శుభాలు ప్రసాదించాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిలు ఆకాంక్షించారు. బుధవారం వినాయక చవితి పర్వదినం పురస్కరించుకుని మంత్రులు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రమంతా వినాయక చవితి పండుగను సంతోషంగా జరుపుకోవాలని, ప్రతి ఒక్కరికి సకల శుభాలు ఆ గణనాథుడు అందించాలని వారు ఆకాంక్షించారు. రాష్ట్రంలో ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వంపై, ప్రజలందరిపై వినాయకుని ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని ఆ గణనాథుడిని ప్రార్థిస్తున్నట్లు మంత్రులు తెలిపారు.
కలెక్టర్, జాయింట్ కలెక్టర్:- జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ ఆనంద్, జాయింట్ కలెక్టర్ కార్తీక్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలందరూ పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతిని పూజించాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.

