మంత్రి నారాయణ అలుపెరగని శ్రామికుడు-ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి
నెల్లూరును మోడల్ సిటీగా..
నెల్లూరు: నెల్లూరును మోడల్ సిటీగా తయారు చేయటమే తన లక్ష్యమని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు.బుధవారం ఆత్మకూరు బస్టాండ్ లో ఏర్పాటు చేసిన నూతన వసతులను ఆయన ప్రారంభించారు. ఆర్టీసీకి సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు అందజేశారు. వసతుల కల్పనకు ముందుకొచ్చిన దాతలను మంత్రి నారాయణ సన్మానించి అభినందించారు.. మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ బస్టాండుల్లో నూతన వసతుల కల్పనకు దాతలు ముందుకు రావటం శుభపరిణామని, ప్రయాణికులకు స్వచ్ఛమైన నీరు అందించేందుకు ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసిన మెడికవర్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ అనీల్ కృష్ణారెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు. అలాగే 50 కుర్చీలు ఏర్పాటు చేసిన లలితా జ్యుయెలరీ ,ఫ్లోర్ క్లీనింగ్ చేసిన మెకరానా మార్బుల్స్ యజమానులకు అభినందనలు తెలియజేశారు..
ఆర్టీసీ అభివృద్ధికి జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి ఎనలేని కృషి చేశారని,, పీఎస్ఆర్ బస్టాండు బోర్డులను పొట్టిశ్రీరాములు ఆత్మకూరు బస్టాండుగా బోర్డులు మార్చి ,భావితరాలకు అమరజీవి త్యాగాన్ని గుర్తు చేసేలా ఫోటోలు ఏర్పాటు చేయటం మంచి ఆలోచన అని మంత్రి అన్నారు..ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమంలో పాల్గొనటం చాలా సంతోషంగా ఉందన్నారు..సురేష్ రెడ్డి అభ్యర్ధన మేరకు ఆత్మకూరు బస్టాండ్ వద్ద నిరుపయోగంగా ఉన్న పబ్లిక్ టాయిలెట్స్ ను అధికారులతో కలిసి పరిశీలించామని, ప్రయాణికులతో పాటు ,స్థానికులకు ఉపయోగపడేలా అత్యాధునికంగా టాయిలెట్స్ నిర్మిస్తామన్నారు.రోడ్డు నిర్మాణపనులు కూడా చేపడతామన్నారు.
నెల్లూరుకు ఎలక్ట్రిక్ బస్సులు:- బస్టాండ్ వద్ద ట్రాఫిక్ సమస్య లేకుండా పొట్టిశ్రీరాములు విగ్రహాన్ని మార్చేందుకు ఆర్యవైశ్యులు అంగీకరించారని, ఏకాభిప్రాయానికి వచ్చిన వారిని అభినందిస్తున్నామన్నారు. విగ్రహం ఏర్పాటు చేసినచోట ఫౌంటైన్,గార్డెన్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు..కాలుష్య నివారణకోసం నెల్లూరుకు ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయన్నారు.సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో జోనల్ పరిధిలోని అన్ని ఆర్టీసీ బస్టాండుల్లో అభివృద్ధి జరగాలని ఆకాంక్షిస్తున్నానన్నారు..అనంతరం ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి నారాయణ అలుపెరగని శ్రామికుడని,అనేక పథకాలకు రూపకర్త అన్నారు..
ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపిటిఓ షమీమ్,టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బ్రహ్మం గుప్తా,జనసేన నేత సుజయ్,లలితా జ్యూయలరీ,మెడికవర్ ప్రతినిధులు,బీజేపీ,జనసేన,టీడీపీ నేతలు పాల్గొన్నారు.

