నక్ష ప్రోగ్రాం ఆవశ్యకతపై ప్రజలందరికీ అవగాహన కల్పించండి-కమీషనర్ నందన్
నెల్లూరు: నగర వ్యాప్తంగా అన్ని డివిజన్లలో చేపడుతున్న సర్వే ప్రోగ్రాంలో వార్డు సచివాలయ ప్లానింగ్ అండ్ రెగ్యులైజేషన్ కార్యదర్శులు, అడ్మిన్ కార్యదర్శులు, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు సంయుక్తంగా పాల్గొని సమన్వయంతో ప్రాజెక్టులో సూచించిన అన్ని అంశాలను అమలులోకి తీసుకొని రావాలని నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ ఆదేశించారు. శినివారం నక్ష కార్యక్రమం పై సమీక్ష సమావేశాన్ని పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు నిర్వహించారు. నక్ష ప్రోగ్రాం ఆవశ్యకతపై ప్రజలందరికీ అవగాహన కల్పించాలని, ప్రజలందరూ సర్వేకు సహకరించే విధంగా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని కమిషనర్ సూచించారు. నిర్దేశించిన సమయంలోపు నక్ష ప్రోగ్రామ్ ను పూర్తి చేసి, నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని ప్రతి అసెస్మెంట్ ను జియో ట్యాగింగ్ చేసి ఆయా జియోగ్రాఫికల్ వివరాలను పూర్తిస్థాయిలో ఆన్లైన్ ద్వారా డేటాను సమర్పించాలని కమిషనర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం సిటీ ప్లానర్ హిమబిందు, వార్డు సచివాలయ ప్లానింగ్ కో ఆర్డినేషన్ టీం, సచివాలయ అడ్మిన్ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.