జిల్లాలో జనవరి 2 వ తేదీ నుంచి భూముల రీసర్వే ప్రక్రియ ప్రారంభం-జె.సి
నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగో విడత భూముల రీసర్వే ప్రక్రియ జనవరి 2 వ తేదీ నుంచి మొదలు కానున్నదని జాయింట్ కలెక్టర్ యం.వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్టులో జిల్లా బాగంగా 93 గ్రామాలు ఎంపిక చేశారు. ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ నుండి 26 గ్రామాలు,కావలి రెవెన్యూ డివిజన్ నుండి 26 గ్రామాలు ,గూడూరు రెవెన్యూ డివిజన్ నుండి 14 గ్రామాలు,నెల్లూరు రెవెన్యూ డివిజన్ నుండి 27 గ్రామాలు మొత్తం కలిపి 93 గ్రామాలలో విస్తీర్ణము 357270.62 ఎకరాలు రీసర్వే చేయనున్నారు. రైతులు రీసర్వే లో పాల్గొనవలిసినదిగా జాయింట్ కలెక్టర్,జిల్లా డిప్యూటీ డైరెక్టర్ వై.నాగశేఖర్ లు తెలిపారు.

