క్రీడల ద్వారా సహాయపడే తత్వం అలవాటు అవుతుంది-కలెక్టర్ ఆనంద్
నెల్లూరు: రెవెన్యూ క్రీడల ద్వారా పోటీ తత్వం,సహాయపడే తత్వం అలవాటు అవుతుందని కలెక్టర్ ఆనంద్ అన్నారు.. ఆదివారం సాయంత్రం స్థానిక ఏసి సుబ్బారెడ్డి స్టేడియంలో 10వ జిల్లా రెవెన్యూ క్రీడా సాంస్కృత ఉత్సవాలు-2025 ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడల ద్వారా వచ్చిన స్ఫూర్తిని పనులలో చూపించినట్లైతే మంచి ఫలితాలు ఉంటాయని అభిప్రాయపడ్డారు. రెవిన్యూ సిబ్బంది దైనందిన జీవితంలో పని ఒత్తిడి వల్ల శారీరక రుగ్మతలకు దగ్గరవడం జరుగుతుందని,, వాటి నిర్మూలించే విధంగా రోజు కొంత వ్యాయామానికి సమయం కేటాయించాలని అందుకు రెవిన్యూ క్రీడలు ఉపయోగపడతాయి అన్నారు. రెవిన్యూ సిబ్బంది బాగా పనిచేస్తే జిల్లా యంత్రాంగానికి మంచి పేరు వస్తుందని అన్నారు. రెవెన్యూ క్రీడల వల్ల ఒకరితో ఒకరికి పరిచయాలు ఏర్పడి సత్సంబంధాలు మెరుగుపడి పడతాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రెవెన్యూ సిబ్బందిని అందరిని ఒక చోటకు చేర్చి క్రీడలు నిర్వహించడం గొప్ప విషయం అని అన్నారు. రాష్ట్రస్థాయిలో రెవెన్యూ క్రీడలను త్వరలోనే నిర్వహించనునట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి హుస్సేన్ సాహెబ్,, రెవిన్యూ డివిజనల్ అధికారులు పావని, అనూష, వంశీకృష్ణ , జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు పెంచలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.