ఫ్లై ఓవర్ బ్రిడ్జిని 45 రోజుల్లో పున:ప్రారంభించాం-మంత్రి నారాయణ
నెల్లూరు: నగరంను స్మార్ట్ సిటీగా ఏర్పాటు తీర్చి దిద్దేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతున్నదని రాష్ట్ర పుర పాలక శాఖ మాత్యులు డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. ఆదివారం నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఆధునీకరించిన ఫ్లై ఓవర్ ను( బ్రిడ్జి) పున:ప్రారంభించారు.ఈ సందర్బంలో మంత్రి మాట్లాడుతూ 1996వ సంవత్సరంలో నిర్మాణం మొదలుపెట్టి 1999 లో ప్రారంభించడం జరిగిందన్నారు. అప్పటినుంచి ఎటువంటి మరమ్మతులకు నోచుకోలేదన్నారు. నేడు కేవలం 45 రోజులు కాలంలో మరమ్మత్తులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందన్నారు. నగరంలో పచ్చదనం పెంపొందించే విషయమై చెట్లు నాటిన కార్యక్రమాన్ని నగరంలోని 14వ డివిజన్లో ప్రారంభించడం జరిగింది అన్నారు.

ప్రతి ఐదు మీటర్లకి ఒక చెట్టును నాటే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. చెట్లు నాటే కార్యక్రమంలో గ్రీన్ కార్పొరేషన్-నగర పాలక సంస్థ సమన్వయంతో పనిచేస్తాయన్నారు. నగరంలోని 13 డ్రైన్లను మరమ్మత్తులు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని, అందుకోసం 50 కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు.8 డ్రైన్స్ మరమ్మత్తుల పనులు జరుగుతున్నాయని మరో ఐదు డ్రైన్స్ పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు.
2017 వ సంవత్సరంలో వచ్చిన తుఫాను వల్ల నగరంలో చాలా వరకు మునిగిపోవడం జరిగిందన్నారు. అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. నగర అభివృద్ధికి విడతల వారీగా అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందని దీనికి ప్రజలు సహకరించాలని కోరారు. డ్రైన్లు మరమ్మతుల విషయమై అన్యాక్రాంతమైన భూములను తొలగించడం జరుగుతుందని అందులో ఆరు మీటర్లకు బదులుగా 3 మీటర్ల వరకు తగ్గించడం జరిగిందన్నారు. నగరవాసులు ఈ విషయమై తమ సహాయ సహకారాలు అందించాలన్నారు.ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ నందన్, గ్రామ వార్డు సచివాలయాలు అధికారి హిమబిందు, అధికారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

