DISTRICTS

ప్రభుత్వ ఆసుపత్రి ప్రసూతి వార్డులో అగ్నిప్రమాదం

ఆందోళన చెందాల్సిన అవసరం లేదు-కలెక్టర్

నెల్లూరు: ప్రభుత్వ ఆసుపత్రి (GGH) ప్రసూతి వార్డులో షర్ట్ సర్కూట్ కారణంగా ఆదివారం సాయంత్రం ఏ.సి మంటలు వ్యాపించడంతో వార్డులో వున్న గర్భిణులు, బాలింతలు, ఆస్పత్రి సిబ్బంది భయంతో వార్డు బయటకు పరుగులు తీశారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది,జీజీహెచ్ కు చేరుకుని మంటలను అదుపు చేశారు.ఈ స్రమాదంలో ఏలాంటి ప్రాణ నష్టం జరగలేదు.   

ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ:- అగ్నిప్రమాదంపై ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరిస్థితిని అదుపులోకి తీసుకుని వస్తున్నట్లు తెలిపారు.రోగులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. త్వరలోనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే చర్యలు మొదలుపెట్టామని కలెక్టర్ తెలిపారు. MCH బ్లాక్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందని, ఇందులో రెండు పడకలు కాలిపోయాయినప్పటికి ఎవరికి కూడా ఎలాంటి గాయాలు కాలేదని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. భద్రతా సిబ్బంది అందరూ అప్రమత్తంగా వ్యవహరించి రోగులను సురక్షితంగా బయటకు తరలించి, మొదటి అంతస్తులోని వేర్వేరు వార్డులు,ఐపీ బ్లాక్‌లో ఉంచారని పేర్కొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *