డ్రైన్ కాలువలపై శాశ్వత నిర్మాణాలను చేపట్టొద్దు- కమిషనర్ నందన్
నెల్లూరు: నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డ్రైను కాలువలలో పూడికతీత, సిల్ట్ తొలగింపు పనులకు అడ్డంకిగా ఎలాంటి శాశ్వత నిర్మాణాలను చేపట్టవద్దని కమిషనర్ నందన్ సూచించారు. బుధవారం పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక 8వ డివిజన్ RSR మున్సిపల్ పాఠశాల ప్రహరీ గోడ చుట్టూ ఉన్న డ్రైన్ కాలువలో నిరంతరం పూడిక తీత పనులను, సిల్ట్ ఎత్తివేత కార్యక్రమాలను చేపట్టి మురుగునీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చూడాలని ఆదేశించారు.

డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాలలో కమిషనర్ పర్యటించి డ్రైన్ కాలువలపై అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను పరిశీలించారు. కాలువలలో పూడికతీతకు అడ్డంకిగా నిర్మించి ఉన్న చిన్నపాటి దుకాణాలు,మెట్లు, ర్యాంపులు, ఇతర నిర్మాణాలను తప్పనిసరిగా తొలగిస్తామని స్పష్టం చేశారు. డ్రైను కాలువలపై ఎలాంటి శాశ్వత నిర్మాణాలను చేపట్టవద్దని స్థానిక ప్రజలకు కమిషనర్ సూచించారు. డ్రైన్ కాలువలపై నిర్మించి ఉన్న అక్రమ నిర్మాణాలను యజమానులే స్వచ్ఛందంగా తొలగించుకోవాలని కమిషనర్ హెచ్చరించారు. అనంతరం కమిషనర్ ఆదేశాల మేరకు పాఠశాల ప్రహరీ గోడ చుట్టూ ఉన్న డ్రైను కాలువలను ఆక్రమిస్తూ చేపట్టిన శాశ్వత నిర్మాణాలను పట్టణ ప్రణాళిక విభాగం అధికారుల నేతృత్వంలో సిబ్బంది తొలగించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ ఆఫీసరు సతీష్ కుమార్ శానిటేషన్గం వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

