పెన్నానది వడ్డున గొబ్బెమ్మల పండుగకు ఏర్పాట్లు-మంత్రి నారాయణ
నెల్లూరు: పెన్నానది తీరంలో ప్రతి ఏటా సంప్రదాయబద్ధంగా నిర్వహించే గొబ్బెమ్మల పండుగ ఏర్పాట్లను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగురు నారాయణ బుధవారం అధికారులతో కలిసి పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, పండుగ ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్టమైన భద్రత, వసతి ఏర్పాట్లు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతు గొబ్బెమ్మల పండుగకు సుమారు 15 వేల మందికి పైగా భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు. అందుకు తగ్గట్టుగానే అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు..కార్పొరేషన్, పోలీస్, ఫైర్, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, టూరిజం మరియు దేవాదాయ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. ఏటిలో నీటిపాయ ఉన్నందున ఈసారి ఒకపక్కే గొబ్బెమ్మల పండుగకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపడతామన్నారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ తో పాటు నారాయణ విద్యాసంస్థల జిఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, స్థానిక టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

