వాహన మిత్ర’’ పథకం కోసం 19వలోగా దరఖాస్తులను అందించాలి-కలెక్టర్ హిమాన్షు శుక్ల
నెల్లూరు: ఆటో, మాక్సీ క్యాబ్ వాహన యజమానులు ‘‘వాహన మిత్ర’’ పథకం కోసం సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. ఈ నెల 19వ (శుక్రవారం)తేదీలోగా దరఖాస్తులను అందించాలని ఆయన సూచించారు. రిజిస్ట్రేషన్ కార్డ్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, ఫిట్ నెస్ మొదలైన సర్టిఫికెట్లతో దరఖాస్తులు అందించాలన్నారు. బ్యాంక్ అకౌంట్ కి ఆధార్-NPCI లింక్ చేసుకోవాలన్నారు. గతంలో (2023 వరకు) ఈ పథకం కోసం దరఖాస్తు చేసిన వారు మరలా దరఖాస్తు చేయావల్సిన అవసరం లేదని, ఇప్పటి వరకు దరఖాస్తు చేయని వారు మాత్రమే సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆటో, మాక్సీ క్యాబ్ వాహన యజమానుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

