నగరపాలక సంస్థలో 7 మంది సిబ్బందికి రికార్డు అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి
నెల్లూరు: నగరపాలక సంస్థలో 4వ తరగతి ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న 7 మంది సిబ్బందికి రికార్డు అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి కల్పిస్తూ కమిషనర్ వై.ఓ నందన్ బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు.ఆర్. వెంకట్రావు (వాచ్ మెన్), ఎం. రమేష్ (పబ్లిక్ హెల్త్ వర్కర్), ఏ.మరియమ్మ, సి.హెచ్. వెంకటరమణ, పి. వరప్రసాద్, ఎండి జాహెద్, కె. లక్ష్మి (అటెండర్లు) కు తాత్కాలిక ప్రాతిపదికన రికార్డ్ అసిస్టెంట్లుగా బాధ్యతలను కేటాయించారు.