రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న 26 మందికి వివిధ హోదాలో పదోన్నతులు-కలెక్టర్ హిమాన్షు శుక్ల
ఒకే రోజుం 26 మందికి పదోన్నతులు..వివరాలు..
నెల్లూరు: సమర్థవంతంగా పనిచేస్తూ, జిల్లాను ప్రగతి పథంలో నిలపాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అన్నారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న 26 మందికి వివిధ హోదాలో పదోన్నతులు కల్పిస్తూ, పదోన్నతుల ప్రొసీడింగ్స్ ను కలెక్టర్ అందించారు. సీనియర్ అసిస్టెంట్ నుండి మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు గా ఎనిమిది మంది, గ్రేడ్–I గ్రామ రెవెన్యూ అధికారుల నుంచి సీనియర్ అసిస్టెంట్ హోదాకు 18 మంది..మొత్తం 26 మంది రెవెన్యూ సిబ్బందికి ఒకే రోజు రికార్డు స్థాయిలో పదోన్నతి కల్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పదోన్నతులు పొందిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక అభినందనలు. పదోన్నతి అంటే కేవలం హోదా మార్పు మాత్రమే కాదు, బాధ్యతలు కూడా పెరుగుతాయి. ప్రజల సమస్యలను వేగంగా, పారదర్శకంగా పరిష్కరించడం మీ ప్రాథమిక కర్తవ్యం. ముఖ్యంగా రెవెన్యూ శాఖకు సంబంధించిన భూ, ప్రజాసంబంధిత అంశాల్లో సమయపాలనతో సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్వో విజయకుమార్, ఏవో విజయకుమార్, తదితరులు పాల్గొన్నారు.
1-సీనియర్ అసిస్టెంట్ నుండి మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు గా పదోన్నతి, నియమించిన వివరాలు:-
తహసీల్దార్ కార్యాలయం, వెంకటాచలం లో ఎన్నికల సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎస్.తనుజను తహసీల్దార్ కార్యాలయం, టి.పి. గూడూరులో మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా నియమించారు.
తహసీల్దార్ కార్యాలయం, ఆత్మకూరులో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కె.పెంచలయ్యను తహసీల్దార్ కార్యాలయం, మర్రిపాడులో మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా నియమించారు.
ఆర్‌డీఓ కార్యాలయం, ఆత్మకూరులో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎస్‌కే. ఫిరోజ్‌ను స్పెషల్ తహసీల్దార్ (ఎల్.ఎ.), కలెక్టర్ కార్యాలయం, నెల్లూరులో స్పెషల్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా నియమించారు.
స్పెషల్ కలెక్టర్ (టి.జి.పి.), నెల్లూరులో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎస్‌కే.సైరా భానును స్పెషల్ తహసీల్దార్ (ఎల్.ఎ.), కలెక్టర్ కార్యాలయం, నెల్లూరులో స్పెషల్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా, అలాగే తహసీల్దార్ కార్యాలయం, అల్లూరు లోమండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా నియమించారు.
డీఎస్ఓ కార్యాలయం, నెల్లూరులో ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న వై. వంశీ కృష్ణను తహసీల్దార్ కార్యాలయం, అల్లూరు లో మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా నియమించారు.
కలెక్టర్ కార్యాలయం, నెల్లూరులో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పి.మోహన రూపను తహసీల్దార్ కార్యాలయం, వింజమూరులో మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా నియమించారు.
స్పెషల్ కలెక్టర్ (టి.జి.పి.), నెల్లూరులో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న టి.పద్మను తహసీల్దార్ కార్యాలయం, కోవూరులో మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా నియమించారు.
స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (టి.జి.పి.), రాపూర్ వద్ద స్పెషల్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న కె. పెంచల బాబును తహసీల్దార్ కార్యాలయం, ఏ.ఎస్.పేటలో మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా నియమించారు.
2-గ్రేడ్–I గ్రామ రెవెన్యూ అధికారుల నుంచి సీనియర్ అసిస్టెంట్ గా పదోన్నతి, నియమింపబడిన స్థలం వివరాలు:
బుచ్చిరెడ్డిపాలెం మండలం బుచ్చి–3 గ్రామానికి చెందిన బట్టు సుధాకర్‌ను ఆర్‌డీఓ కార్యాలయం, ఆత్మకూరులో సీనియర్ అసిస్టెంట్‌గా నియమించారు. వెంకటగిరి మండలం బంగారుపేట గ్రామానికి చెందిన బొప్పూరు నాగేంద్ర కుమార్‌ను తిరుపతి జిల్లాకు కేటాయించారు. కొడవలూరు మండలం రెగడిచెలిక గ్రామానికి చెందిన తోట మురళీధర్‌ను తహసీల్దార్ కార్యాలయం, విన్జమూరులో సీనియర్ అసిస్టెంట్‌గా నియమించారు.
బుచ్చిరెడ్డిపాలెం మండలం మునులపూడి గ్రామానికి చెందిన రఘుపతిరావు కుళ్ళూరును తహసీల్దార్ కార్యాలయం, ఆత్మకూరులో ఈఎస్‌ఏగా నియమించారు. వాకాడు మండలం నిడిగుర్తి గ్రామానికి చెందిన ఎర్రమత్తు కోటయ్యను తిరుపతి జిల్లాకు కేటాయించారు. నెల్లూరు రూరల్ పరిధిలోని చెన్నకేశవ నగర్‌కు చెందిన చేవూరు అమరావతిని కలెక్టర్ కార్యాలయం, నెల్లూరులో సీనియర్ అసిస్టెంట్‌గా నియమించారు.
గూడూరు మండలం మిట్టముక్కూరు గ్రామానికి చెందిన దాసరి హనుమంతయ్యను తహసీల్దార్ కార్యాలయం, మర్రిపాడులో సీనియర్ అసిస్టెంట్‌గా నియమించారు. గూడూరు మండలం వెండోడు గ్రామానికి చెందిన కొతపాటి పుల్లయ్యను తహసీల్దార్ కార్యాలయం, చిల్లకూరు మండలంలో నియమించారు. చెన్నూరు–II గ్రామానికి చెందిన శ్రీనివాసులు నాయుడు కరణంను ఆర్‌డీఓ కార్యాలయం, గూడూరులో సీనియర్ అసిస్టెంట్‌గా నియమించారు.
వాకాడు మండలం పుదిరాయడొరువు గ్రామానికి చెందిన అరికట్ల సురేంద్రను తిరుపతి జిల్లాకు కేటాయించారు. మనుబోలు మండలం వెంకన్నపాలెం గ్రామానికి చెందిన కాంచి చంద్రశేఖర్‌ను ఎస్‌డీసీ (టి.జి.పి.) కార్యాలయం, రాపూరు, నెల్లూరులో సీనియర్ అసిస్టెంట్‌గా నియమించారు. గూడూరు మండలం చెన్నూరు–II–2 గ్రామానికి చెందిన వరిగొండ సురేంద్రనాథ్‌ను తిరుపతి జిల్లాకు కేటాయించారు.
టి.పి. గూడూరు మండలం వరకవిపూడి గ్రామానికి చెందిన యేతూరు మధన్ మోహన్ రెడ్డిని తహసీల్దార్ కార్యాలయం, దుత్తలూరులో సీనియర్ అసిస్టెంట్‌గా నియమించారు. రాపూరు మండలం సంక్రాంతిపల్లి గ్రామానికి చెందిన కన్నేదారి రవిశేఖర్‌ను చేజర్ల మండలంలో సీనియర్ అసిస్టెంట్‌గా నియమించారు. ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామానికి చెందిన కాకుటూరు శ్రీహరిని కలెక్టర్ కార్యాలయం, నెల్లూరులో సీనియర్ అసిస్టెంట్‌గా నియమించారు.
నెల్లూరు రూరల్ పరిధిలోని సౌత్ మోపూరు గ్రామానికి చెందిన పులి దొరసనమ్మను ఎస్‌డీసీ ఎస్‌ఎస్‌పి, ఆత్మకూరులో సీనియర్ అసిస్టెంట్‌గా నియమించారు. కలువోయ మండలం కలువోయ–2 గ్రామానికి చెందిన చలమచర్ల సునయనను తహసీల్దార్ కార్యాలయం, కలువోయలోనే సీనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి ఇచ్చారు. చిట్టమూరు మండలం చిల్లమూరు గ్రామానికి చెందిన వీఆర్‌ఓను కలెక్టర్ కార్యాలయం, నెల్లూరులో సీనియర్ అసిస్టెంట్‌గా నియమించారు.

