తిరుపతి ఆటోనగర్ స్థలాల రిజిస్ట్రేషన్లపై 22A నిషేధం ఎత్తివేత-కలెక్టర్ వెంకటేశ్వర్
తిరుపతి: తిరుపతి ఆటోనగర్ స్థలాల రిజిస్ట్రేషన్లపై అమల్లో ఉన్న 22A నిషేధాన్ని జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీని వల్ల ఆటోనగర్ యజమానులకు దీర్ఘకాలంగా ఉన్న సమస్యకు పరిష్కారం లభించిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (APIIC) 1997లో 18.25 ఎకరాల్లో 338 స్థలాలు అభివృద్ధి చేసి వీటిలో 337 స్థలాలు ఆటోమొబైల్ యూనిట్లకు కేటాయించబడ్డాయని, 29.09.2025 నాటికి ఒక్క స్థలం కూడా ఖాళీగా లేదు అని తెలిపారు. 20.10.2018 నుంచి తిరుపతి సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్కరంపల్లె గ్రామం సర్వే నం.74/7 మరియు మంగళం గ్రామం సర్వే నం.95/2 నిషేధిత జాబితాలో ఉన్నాయని పేర్కొంటూ రిజిస్ట్రేషన్లు నిలిపివేశారని, రెవెన్యూ సదస్సుల్లో అనేకమంది చేసిన విజ్ఞప్తులను పరిశీలించి, సమీక్ష అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. దీని ద్వారా అనేక పుర ప్రజలకు అనేక ప్రయోజనాలు వస్తాయని తెలిపారు.
1) 337 ఆటోమొబైల్ యూనిట్లు నేరుగా లబ్ధి పొందనున్నాయి. 2) సుమారు 1,500 మంది కార్మికులకు పరోక్షంగా ఉద్యోగ భద్రత లభిస్తుంది. 3) యజమానులు ఇకపై చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. 4) భాగస్వామ్య సంబంధ వివాదాల నుండి రక్షణ లభిస్తుంది. 5) వారసత్వ బదలాయింపు, రుణాల పొందకం, ప్రభుత్వ పథకాలకు అర్హత వంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్య పరిష్కారమైందని కలెక్టర్ తెలిపారు.