రెండు రూపాయలకే 20 లీటర్ల సురక్షిత తాగునీరు-కమిషనర్ నందన్
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలో ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ సుజల సురక్షిత తాగునీటి పథకాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ వై.ఓ నందన్ సూచించారు. సోమవారం స్పందన కార్యక్రమం అనంతరం కమీషనర్ మీడియాతో మాట్లాడుతూ స్థానిక వెంకటేశ్వరపురం వేప దరువు పాత మున్సిపల్ కార్యాలయం ప్రాంగణాల ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సుజల సురక్షిత త్రాగునీటి వాటర్ ప్లాంట్ల నుంచి సేకరించి, నగరవ్యాప్తంగా 15 రిమోట్ డిస్పెన్సరీ కేంద్రాల ద్వారా ప్రతిరోజు సుమారు మూడు లక్షల లీటర్ల సురక్షిత తాగునీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు.
రెండు రూపాయలకే:- తాగునీటి కేంద్రాలలో వివరాలను నమోదు చేసుకున్న మొదట 100 మంది లబ్ధిదారులకు 50 రూపాయల రిజిస్ట్రేషన్, 20 రూపాయల రీఛార్జ్ ఉచితంగా అందజేస్తున్నట్లు కమిషనర్ ప్రకటించారు. ఎన్టీఆర్ సుజల పధకం ద్వారా కేవలం రెండు రూపాయలకే 20 లీటర్ల సురక్షిత తాగునీటిని పొందే అవకాశాన్ని పౌరులందరూ సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ రామ్ మోహన్ రావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కనకాద్రి, సిటీ ప్లానర్ హిమబిందు, మేనేజర్ రాజేశ్వరి, సిబ్బంది పాల్గొన్నారు.