నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య
నెల్లూరు: నగరంలోని ACSR GOVT medical collegeలో MBBS 1st year చదువుతున్న బన్నెల గీతాంజలి అనే విద్యార్థిని శుక్రవారం ఉధయం 3వ అంతస్తులోని తన రూమ్ లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. నంద్యాలకు చెందిన గీతాంజలి దసరా సెలవులకు ఉరికి వెళ్లి అనాటమీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వుండడంతో గురువారం తిరిగి కాలేజ్ కు చేరుకుంది. నేటి ఉదయం స్నేహితులతో కలసి బ్రేక్ ఫాస్ట్ చేసిన గీతాంజలి తిరిగి రూమ్ కు వెళ్లినట్లు అమె స్నేహితులు తెలిపారు. ఈ విషయమై సి.ఐ రోశయ్య మట్లాడుతూ ఆత్మహత్యకు సంబంధించి కారణాలపై దర్యప్తు చేస్తున్నమన్నారు. గీతాంజిలీ మరణించిన వార్త అమె తల్లి,తండ్రులకు తెలిపామన్నారు.విచారణ అనంతరం వివరాలు తెలుస్తాయన్నారు. అధికారులు. కళాశాలలోకి ఎవరినీ అనుమతించ లేదు.విద్యార్ది సంఘలు మాట్లాడుతూ త్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు.