CRIMEOTHERSWORLD

జర్మనీలోని ఓ బ్యాంకులో రూ.316 కోట్ల భారీ దోపిడీ

అమరావతి: జర్మనీలోని ఓ బ్యాంకులో అదివారం భారీ దోపిడీ జరిగింది. గెల్సెన్‌కిర్చెన్‌లోని స్పార్కాస్కై బ్యాంకులో 2500 మంది ఖాతదారులకు సంబంధించిన రూ.316 కోట్లను దోపిడీ చేశారు..బుయర్ ప్రాంతంలో ఉన్న స్పార్కాసై బ్యాంకు శాఖను లక్ష్యంగా చేసుకున్న దొంగలు, పక్కనే ఉన్న పార్కింగ్ గ్యారేజి నుంచి బ్యాంకులోకి ప్రవేశించారు. గ్యారేజి నుంచి భూగర్భంలో ఉన్న వాల్ట్ (సేఫ్టి లాకర్స్) రూమ్‌ గొడకు రంధ్రం చేసి బ్యాంకులోకి చొరబడ్డారు. 2500లు సేఫ్ డిపాజిట్ బాక్సులను పగులగొట్టి, అందులోని నగదు, బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను దోచుకెళ్లారు. సోమవారం తెల్లవారుజామున ఫైర్ అలారం మోగడంతో ఈ దోపిడీ వెలుగులోకి వచ్చింది.

బ్యాంకు దోపిడీ గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి వచ్చి పరిశీలించారు. వాల్ట్‌రూమ్‌ దగ్గరలో రంధ్రాన్ని గుర్తించారు. శని,ఆదివారం రాత్రి సమయంలో గ్యారేజీ మెట్ల వద్ద కొందరు వ్యక్తులు పెద్ద సంచులు మోసుకుంటూ వెళ్లడం చూశామని కొంత మంది స్థానికులు పోలీసులకు తెలిపారు.జర్మనీలో ఇప్పటి వరకు జరిగిన దొపిడిల్లో ఇదే అతి పెద్దదని పోలీసులు పేర్కొన్నారు.

ఈ సంఘటనపై విచారణ జరిపిన పోలీసులు,, బ్యాంకు సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా సోమవారం ఉదయం మాస్కులు ధరించి వ్యక్తులు బ్లాక్ కలర్ ఆడి 6 కారులో బయటకు వెళ్లినట్లు గుర్తించారు. క్రిస్మస్ సెలవులను అదునుగా చేసుకుని దొంగలు బ్యాంకును దొపిడీ చేశారని పోలీసులు వెల్లడించారు. సెలవు ఉన్న రెండు రోజులు దొంగలు బ్యాంకులోనే ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు.

మొత్తం సేఫ్ డిపాజిట్ బాక్సుల్లో 95 శాతం వరకు దోపిడీకి గురైనట్లుగా బ్యాంకు అధికారులు తెలిపారు. ఒక్కో బాక్సు పరిమితి విలువ 10,300 యూరోలు అని తెలిపారు. దీంతో మొత్తం నష్టాన్ని దాదాపు 30 మిలియన్ యూరోలు (రూ. 316 కోట్లు)గా అంచనా వేస్తున్నారు. బ్యాంకులో దోపిడీ జరిగిందని తెలియడంతో కష్టమర్లలో తీవ్ర ఆందోళన నెలకొంది. మంగళవారం  ఖతాదారులు బ్యాంకు వద్దకు చేరుకుని ఆందోళన చేయడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా బ్యాంకును మూసివేశారు. కస్టమర్ల ఆందోళన నేపథ్యంలో హాట్ లైన్ ఏర్పాటు చేసి, బాధితులకు రాతపూర్వకంగా సమాధానమిస్తామని,,బీమా కంపెనీతో కలిసి క్లైయిమ్ ప్రక్రియ చేపడతామని బ్యాంకు అధికారులు తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *