CRIMENATIONAL

ప్రేమ పేరుతో వేధింపులు-మెడికల్ కాలేజీలో ప్రోఫసర్ కు చెప్పు దెబ్బలు

అమరావతి: మెడికల్ కాలేజీలో ప్రోఫసర్ గా విద్యార్దులకు పాఠాలు చెపాల్సిన వ్యక్తి, తన గురు స్థానం మర్చిపోయి, I LOVE YOU అని చెప్పి చెప్పు దెబ్బలు తిన్న ఉదంతం కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. బుధవారం జరిగిన సంఘటన తాలుక వీడియోలు సోషల్ మీడియాలో హల్ చెల్ చేస్తున్నాయి.వివరాల్లోకి వెళ్లితే…

బెంగళూరుకు చెందిన అబ్దుల్ మహమ్మద్ నేలమంగళలోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. మార్చి 25వ తేదీన క్లాస్ చెబుతున్న సమయంలో ఓ విద్యార్థినిని ఉద్దేశిస్తూ మాట్లాడాడు. ఆమె తనను ప్రేమిస్తుంది అంటూ,క్లాస్ రూములో అందరిముందు ఆమెకు ‘ఐ లవ్ యూ’ కూడా చెప్పాడు. ఆ విద్యార్థిని అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినా అతడు అంతటితో ఆగలేదు. క్లాస్ రూములో ఉన్న వారందరికీ చాక్లెట్స్ పంచమని ఓ వ్యక్తిని పురమాయించాడు. స్టూడెంట్స్ వాటిని తీసుకోలేదు. ప్రొఫెసర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిసేపటి తర్వాత ప్రొఫెసర్ విద్యార్థిని దగ్గరకు వచ్చాడు.‘నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పావు కదా?’ అని ప్రశ్నించాడు. ఆమెకు తనపై ఇష్టం ఉందని, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దాన్ని నిరూపిస్తానని అన్నాడు. విద్యార్థులందరూ సీసీటీవీ ఫుటేజీలను చూపించాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రొఫెసర్ భయపడిపోయాడు. తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి.. అక్కడినుంచి జారుకునే ప్రయత్నం చేశాడు. దింతో ఆగ్రహించిన బాధిత విద్యార్థిని ప్రొఫెసర్‌ను చెప్పుతో కొట్టింది. తోటి విద్యార్థులు కూడా ఆయనపై చెప్పులతో దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గొడవను ఆపి ప్రొఫెసర్‌‌ను అక్కడినుంచి తీసుకెళ్లిపోయారు. కంప్లైంట్ ఆధారంగా కేసు దర్యాప్తు జరుగుతుందని పోలీసులు తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *