గుజరాత్‌లో బ్రిడ్జి కూలి నాలుగురు మృతి
అమరావతి: గుజరాత్ రాష్ట్రంలోని వడోదర జిల్లాలోని మహిసాగర్ నది పై ఉన్న గంభీర్ వంతెనలోని కొంత బాగం కూలిపోవడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు..బుధవారం ఉదయం 7-30 గంటల సమయంలో ఘోర ప్రమాదం జరిగింది.. ఈ సంఘటనలో బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న 4 వాహనాలు నదిలో పడిపోయాయి..అందులో 2 ట్రక్కులు, 2 వ్యాన్లు ఉన్నాయి.. బ్రిడ్జ్ మీద నుంచి వాహనాలు పడిపోవడంతో నాలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.. ఇప్పటి వరకు 2 ట్రక్కులు, ఒక ఎకో వ్యాన్, ఓ పికప్ వ్యాన్, ఆటో నదిలో పడిపోయినట్లు గుర్తించామని వడోదర జిల్లా కలెక్టర్ అనిల్ ధమేలియా తెలిపారు.. 45 ఏళ్ల కిందట నిర్మించిన వంతెన కావడం,,గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా భారీగా వానలు పడుతుండటం వల్ల బ్రిడ్జి కూలిపోయి ఉండొచ్చని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు.. వడోదర-ఆనంద్ పట్టణాలను కలిపే ఈ వంతెన కూలడంతో ఇరు ప్రాంతాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది..ఎంత మంది మరణించారు అనే విషయంపై పూర్తి సమాచారం తెలియాల్సి వుంది.