ఛత్తీస్ గఢ్,కర్రెగుట్ట వద్ద జరిగిన ఎన్‌కౌంటర్ లో ఐదుగురు మావోయిస్టులు హతం
అమరావతి: తెలంగాణ-ఛత్తీస్ గఢ్ ప్రాంతంలోని కర్రెగుట్ట వద్ద జరిగిన ఎన్‌కౌంటర్ లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. మావోయిస్టు అగ్రనేత, ఆ పార్టీ కార్యదర్శి దేవ్ జీ లక్ష్యంగా కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. కర్రెగుట్టల్లో తలదాచుకున్న మావోయిస్టులు, ఈ విషయాన్ని గమనించి భద్రతా బలగాలపైకి కాల్పులు జరపడంతో వెంటనే భద్రతా బలగాలు సైతం ఎదురుకాల్పులకు దిగాయి.మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భద్రతా బలగాలు వెల్లడించాయి. మృతుల్లో అగ్రనేతలు ఉండవచ్చని భద్రతా దళాలు భావిస్తున్నాయి. మధ్యప్రదేశ్ నుంచి కర్రెగుట్టల్లోకి మావోలు ప్రవేశించారంటూ నిఘా వర్గాలకు విశ్వనీయమైన సమాచారం అందింది. ఈ నేపథ్యంలో నిఘా వర్గాల సమాచారంతో భద్రతా బలగాలు ఈ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టాయి.
అజ్ఞాతంలో వున్న 15మంది మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు కూబింగ్ ను తీవ్రతరం చేశాయి. ఈ జాబితాలో రాజిరెడ్డి@సంగ్రామ్,, మావోయిస్టు కీలక నేత ముప్పాళ్ల లక్ష్మణరావు@గణపతి, పుసునూరి నరహరి@సంతోష్, ముప్పిడి సాంబయ్య, వార్త శేఖర్, జోడే రత్నభాయి, బడే చొక్కారావులు వున్నారు.

