విశాఖజిల్లా వద్ద రైలులో అగ్నిప్రమాదం-ఒకరు సజీవ దహానం
అమరావతి: విశాఖపట్నం (వయా) దువ్వాడ మీదుగాఎర్నాకుళం వెళ్లే టాటా-ఎర్నాకుళం (18189) ఎక్స్ ప్రెస్‌లో సోమవారం వేకుమజామున 1.15 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో B1,M2 AC బోగీలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి సజీవ దహనమయ్యారు.
ఆదివారం రాత్రి దువ్వాడ మీదుగా బయల్దేరిన ఎర్నాకుళం ఎక్స్ ప్రెస్ అనకాపల్లికి ఆలస్యంగా వచ్చింది. అక్కడి నుంచి బయల్దేరిన అనంతరం నర్సింగబల్లి వద్ద B1 ఏసీ బోగీ బ్రేక్‌లు పట్టేయడంతో అగ్నికీలలు వ్యాపించినట్లు తెలుస్తొంది. దీంతో రైలులోని ప్యాంట్రీ కారును ఆనుకుని ఉన్న B1,M2 AC బోగీల్లో మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని ఎలమంచిలి సమీపంలోని పాయింట్ వద్ద లోకో పైలట్లు గుర్తించి స్టేషన్లో రైలును నిలిపివేశారు. అనకాపల్లి,,ఎలమంచిలి,, నక్కపల్లి నుంచి ఫైర్ సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. అప్పటికే రెండు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. B1AC బోగీలోని ప్రయాణిస్తున్న వైజాగ్‌కు చెందిన చంద్రశేఖర్ సుందర్ (70)గా గుర్తించారు. రైల్వే ఉన్నతాధికారులు ప్రమాదస్థలికి చేరుకుని పరిశీలించారు. అర్ధరాత్రి 3.30 గంటలు దాటిన తరువాత దగ్ధం అయిన రెండు బోగీలను తొలగించారు. సదరు బోగీల్లో ప్రయాణిస్తున్నవారిని మూడు ఆర్టీసీ బస్సుల్లో సామర్లకోట రైల్వే స్టేషన్‌కు రైల్వే అధికారులు తరలించారు. సామర్లకోటలో రెండు ఏసీ బోగీలను జతచేసి అక్కడి నుంచి ఎర్నాకుళం రైలు వెళ్లేందుకు అనుమతించారు

