బంగ్లాదేశ్‌లో మరో హిందువును దారుణంగా కొట్టి చంపిన బంగ్లాదేశీయులు
అమరావతి: బంగ్లాదేశ్‌లో హిందువులపై మరో దారుణమైన,,హింసాత్మక సంఘటన వెలుగు చూసింది. మైమెన్‌సింగ్‌లోని భలుకాలో 27 ఏళ్ల హిందూ వస్త్ర కార్మికుడు దిపు చంద్ర దాస్‌ను కొట్టి చంపిన కొద్ది రోజుల్లోనే మరో హిందూ వ్యక్తి అమృత్ మండల్ ను ఒక ముఠా కొట్టి చంపారు. అమృత్ వయసు 29 సంవత్సరాలు. బంగ్లాదేశ్‌లోని రాజ్‌బరి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పంగ్షా గ్రామానికి చెందిన 29 ఏళ్ల అమృత్ మండల్ అలియాస్ సామ్రాట్ పై బుధవారం రాత్రి షాహిదుల్ ఇస్లాం అనే వ్యక్తికి సంబంధించి,,అప్పు వససూలు చేసుకునేందుకు వెళ్లినట్లు తెలుస్తొంది.ఒక గుంపు మండల్ పై దాడి చేసి కొట్టి చంపింది.తిరిగి అమృత్ పై ఆరోపణలు చేసింది. గుంపు దాడిలో తీవ్రంగా గాయపడిన సామ్రాట్‌ను ఆసుపత్రికి తరలించగా అతడు అప్పటికే మరణించినట్లు బంగ్లాదేశ్ పోలీస్ అధికారి తెలిపారు. మంగళవారం, చిట్టగాంగ్ సమీపంలోని రౌజన్ ప్రాంతంలో ఒక హిందూ కుటుంబం ఇల్లు తగలబడింది. ఐదు రోజుల్లో రౌజన్ ప్రాంతంలో ఏడు హిందూ కుటుంబాల ఇళ్ళు తగలపెట్టారు.

