గరియాబాద్ జిల్లాలో మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ-10 మంది మృతి
అమరావతి: ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబాద్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు.. మృతుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మనోజ్ అలియాస్ మోదెం బాలకృష్ణ కూడా ఉన్నట్లు తెలుస్తొంది..గురువారం మెయిన్‌పుర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అడవుల్లో భద్రతా దళాలు కూబింగ్ ఆపరేషన్‌ను నిర్వహించాయి.. ఈ నేపధ్యంలో మావోయిస్టులకు,, భద్రతా సిబ్బంది మధ్య కాల్పులు జరిగినట్లు ఐజీపీ అమ్రేష్ మిశ్రా తెలిపారు.. గరియాబంద్ ఎస్పీ నిఖిల్ రఖేచా ఎన్‌కౌంటర్‌ని పర్యవేక్షిస్తున్నారని సమాచారం..
ఈ ఆపరేషన్‌లో స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్టీఎఫ్), కోబ్రా, రాష్ట్ర పోలీసులు పాల్గొన్నారని పేర్కొన్నారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు..ఎదురు కాల్పుల్లో మరణించిన వారిలో ఒడిశా రాష్ట్ర కమిటీ సభ్యుడు ప్రమోద్ యారఫ్ పాండు కూడా ఉన్నట్లుగా సమాచారం. సంఘటన స్థలి నుంచి మృతదేహాలతోపాటు పెద్ద ఎత్తున ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తొంది.