వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్ని కేసుల్లో బెయిల్
విడుదల అవుతారా?
అమరావతి: వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌కి షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది.. నకిలీ ఇళ్ల పట్టాల కేసుపై మంగళవారం నూజివీడు కోర్టులో ఇరు వర్గాల అడ్వకేట్లు వాదనలు విన్పించారు..అనంతరం వంశీకి,,లక్ష రూపాయలకు 2 ష్యూరిటీలు,, వారానికి రెండుసార్లు స్టేషన్ కి రావాలంటూ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది..వల్లభనేని వంశీ ఈ కేసులో ఇప్పటివరకూ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు..నేడు బెయిల్ కావడంతో, ఇంతవరకూ వంశీపై నమోదైన అన్ని కేసుల్లోనూ ఆయనకి బెయిల్ మంజూరు అయినట్లయింది..అయితే వంశీ బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది..సదరు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరుగనున్నది..దీంతో వల్లభనేని.వంశీ జైలు నుంచి విడుదల అవుతారా? లేదా? అన్నది వేచి చూడాలి.?