AP&TGMOVIESOTHERS

ఇప్పటి దాక మేకలు తినే పులిని మీరు చూసి ఉంటారు-హరి హర వీరమల్లు

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ సినిమా కోసం తెలుగు రాష్ట్రల్లోని అభిమానులు ఎంతొ కాలం నుంచి ఎదురు చూస్తూన్న హరి హర వీరమల్లు ట్రైలర్ గురువారం విడుదల అయింది..రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంపిక చేసిన థియేటర్లలో అభిమానుల కోసం గురువారం ప్రదర్శించారు.. పవన్ కళ్యాణ్‌ మూవీ కోసం కొంతకాలంగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ లో ఈ ట్రైలర్ కొత్త వూపు నింపింది.. హైదరాబాద్ విమల్ థియేటర్ లో జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో చిత్ర బృందం పాల్గొన్నారు..2.55 సెకన్ల నిడివి ఉన్న ఈ సినిమాలో చిత్రంకు సంబంధించిన లైన్ ను పదర్శించారు.. ఢిల్లీలో వున్న ఔరంగజేబుకు,,తెలుగు గడ్డలో పుట్టిన హరిహర వీరమల్లు ఎలా సింహస్వప్నంగా మారాడు అన్నదే కథశం….హిస్టారికల్‌ యాక్షన్‌గా ఈ సినిమా సిద్ధమయ్యింది.. మొఘల్‌ సామ్రాజ్యం నేపథ్యంలో కథ సాగుతుంది..నిధి అగర్వాల్‌ హీరోయిన్​గా నటించింది..ఈ చిత్రంను రెండు భాగాల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు..తొలి భాగం“స్వార్డ్ వర్సెస్ స్పిరిట్”పేరుతో విడుద కానుంది..ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగానూ బాధ్యతలను నిర్వర్తిస్తున్న పవన్ కళ్యాణ్, నిజ జీవితంలోనూ ఎదుర్కొన్న సమస్యలను ప్రతిబించేలానూ ఇందులోని సంభాషణలు ఉన్నాయి..ఇందులో “ఇప్పటి దాక మేకలు తినే పులిని మీరు చూసి ఉంటారు..ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బులిని చూస్తారు” అనే డైలాగ్ థియేటర్ లో గూస్ బంప్స్ తెప్పించేలా వున్నయి..అలాగే గతంలో తాను అధికారంలోకి రాకూడదని కోరుకున్న వారిని హెచ్చరిస్తూ కూడా ఓ డైలాగ్ ను ఈ ట్రైలర్ లో చూపించారు..”నేను రావాలని చాలామంది ఆ దేవుడికి దణ్ణం పెట్టుకుంటూ ఉంటారు..కానీ నేను రాకూడదని మీరు పయత్నిస్తూనే వున్నారు..”  “వినాలి….వీరమల్లు చెప్పింది వినాలి” మరో డైలాగ్ వుంటుంది. కీరవాణి మ్యూజిక్​ అందించారు..జ్ఞాన శేఖర్ వి.ఎస్,మనోజ్ పరమహంస సినిమ్యాటోగ్రాఫర్​గా వ్యవహరిస్తున్నారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *