మహిళా సాధికారత ఒక్క రోజులో సాధ్యం కాదు-లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా
తిరుపతి: మహిళలకు గౌరవం ఇవ్వడం భారతదేశ సంప్రదాయమని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఉద్ఘాటించారు. ఆదివారం తిరుపతిలో రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభల మహిళా సాధికారత కమిటీ జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న సందర్బంలో స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ మహిళల భాగస్వామ్యం లేకుండా ఏ దేశం అభివృద్ధి చెందలేదని తెలిపారు.మహిళల అభివృద్ధికి మన రాజ్యాంగం అనేక నిబంధనలు రూపొందించిందని అన్నారు. మహిళా సాధికారత ఒక్క రోజులో సాధ్యం కాదని,,వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తు వుంటేనే మహిళా సాధికారత సాధించగలమని ఓం బిర్లా పేర్కొన్నారు.

