తెలుగు-సంస్కృత అకాడమీ చైర్మన్ గా విల్సన్ నియమకం
అమరావతి: తెలుగు -సంసృత అకాడమీ చైర్మన్ గా ఆర్. డి. విల్సన్ @ శరత్ చంద్ర ని నియమాకం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 156 విడుదల చేసింది. విల్సన్ బీజేపీ అధికార ప్రతినిధి గానూ,గతం బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గా పని చేశారు. దశాబ్దకాలం పైగా బీజేపీ కి సేవలు అందించారు. అంతకు ముందు ఆయన కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉమ్మడి రాష్ట్రములో ఎస్. సి కార్పొరేషన్ చైర్మన్ గా పని చేశారు. విల్సన్ ఉన్నత విద్యావంతుడు. ఈనాడు, ఆంధ్ర జ్యోతి లో ఏడేళ్లు పని చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా 9 ఏళ్ళు పని చేసి తన ఉద్యోగం కి రాజీనామా చేసి రాజకీయ రంగ ప్రవేశం చేశారు.
శరత్ చంద్ర కలం పేరుతో నాలుగు వందలకు పైగా కథలు,20 పైగా నవలలు రాసారు. ప్రస్తుతం ఉషా సాహితీ పత్రిక లకు సంపాదకులు గా వ్యవహరిస్తున్నారు.తానా సభల్లోనూ, అంతర్జాతీయ తెలుగు మహాసభల్లోనూ వక్త గా పాల్గొని తన బాణీ వినిపించారు.
ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ తనని నమ్మి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ కి,జనసేన నేత పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలిపారు.తెలుగు భాషా వికాసం కొరకు కృషి చేస్తాను అన్నారు.