డిప్యూటీ సీఎం ఫొటో ఏర్పాటు చేయకూడదని నిషేధం ఎక్కడ ఉంది?-హైకోర్టు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను చట్టబద్ధమైన అనుమతులు లేకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ రైల్వే విశ్రాంత ఉద్యోగి వై.కొండలరావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది..బుధవారం పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టిన ధర్మాసనం.. డిప్యూటీ సీఎం ఫొటో ఏర్పాటు చేయకూడదని నిషేధం ఎక్కడ ఉంది? అని ప్రశ్నించింది..
రాజకీయ లక్ష్యాలతో:- రాజకీయ దృష్టితో, ఉద్దేశపూర్వకంగా పిటిషన్ దాఖలైందని అభిప్రాయం వ్యక్తం చేసింది..అయితే, ప్రజాహిత ప్రయోజనాల కోసం చట్టబద్ధంగా కోర్టును ఆశ్రయించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కోర్టు వ్యాఖ్యనించింది..సమాజానికి మేలు చేసే విధంగా,, నిజమైన ప్రజా ప్రయోజనాలపై దృష్టి సారించిన పిటిషన్లను మాత్రమే కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందని హైకోర్టు స్పష్టం చేసింది..ఈ తీర్పుతో పాటు, రాజకీయ లక్ష్యాలతో కోర్టులను వేదికగా మార్చే ప్రయత్నాలు మంచిదికాదని ధర్మాసనం హెచ్చరించింది.