రాజమండ్రి అంటే గుర్తుకొచ్చేది గోదావరి తీరం-పవన్ కళ్యాణ్
అఖండ గోదావరి ప్రాజెక్ట్,,గజేంద్ర సింగ్ షెకావత్…
అమరావతి: రాజమండ్రి అంటే గుర్తుకొచ్చేది గోదావరి తీరం, అలాగే డొక్కా సీతమ్మ, ఆదికవి నన్నయ్యకు జన్మనిచ్చిన నేల గోదావరి ప్రాంతమని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు..గురువారం కేంద్ర కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో కలసి పుష్కర ఘాట్ వద్ద అఖండ గోదావరి ప్రాజెక్టు కు శంకుస్థాపన చేశారు.. ఈ సందర్బంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో వుండడంతో డబుల్ ఇంజిన్ సర్కార్ వేగం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది పనులు కన్పిస్తొందన్నారు..
ఇందులో బాగంగా రూ.430 కోట్లతో రాష్ట్రంలో పర్యాటక ప్రాజెక్టులు చేపడుతున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు..ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆలోచనలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలో పర్యాటక రంగంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే విధంగా ప్రణాళికలు చేపడుతున్నామన్నారు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కేంద్ర మంత్రి షెకావత్ సహకారం అందించారన్నారు.. అలాగే పోలవరం ప్రాజెక్టు కోసం షెకావత్ సహకారం అందించారని కొనియాడారు..ఆంద్రప్రదేశ్ లో 974 కిలోమీటర్ల నదీ తీరం ఉందని,, విదేశాల్లో నదీ తీరాలను పర్యాటక రంగంగా అభివృద్ధి చేసిన విధంగా అఖండ గోదావరి ప్రాజెక్టును పర్యాటకంగా తీర్చిదిద్దుతామన్నారు..2035 నాటికి రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు..
టూరిజం స్పాట్‌గా హేవలాక్ రైల్వే వంతెన..రాజమండ్రి వద్ద గోదావరిపై 127 సంవత్సరాల చరిత్ర ఉన్న హేవలాక్ రైల్వే వంతెనను టూరిజం స్పాట్‌గా ప్రభుత్వం అభివృద్ధి చేయనున్నారు.. రాజమండ్రి రూరల్ బొమ్మూరులో రూ.15 కోట్లతో నిర్మాణం చేపట్టిన సైన్స్ మ్యూజియాన్ని కేంద్ర మంత్రి షెకావత్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రారంభోత్సవం చేశారు..అలాగే దివాన్ చెరువు వద్ద రూ.30 కోట్ల వ్యయంతో ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ అకాడమీకి శంకుస్థాపన చేశారు..ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడు,పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి పురంధేశ్వరి తదితరులు పాల్గొన్నారు.