శ్రీశైలం ఎమ్మెల్యే రోడ్డు మీద పడి దాడి చేయడం ఏమిటి-లోకేష్
లేడీ డాన్… ఎమ్మెల్యే సునీల్ పేరు..
అమరావతి: ఇటీవల కాలంలో రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పలు సంఘటనలపై ఎమ్మెల్యేలను సీఎం చంద్రబాబు తీవ్రంగా మందలించారు..గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది..ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించారు..ఈ సందర్బంలో సీ.ఎం మాట్లాడుతూ నేతలు ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తిస్తే ఉపేక్షించేంది లేదని హెచ్చరించారు.. ఎమ్మెల్యేలే అడ్డగోలుగా వ్యవహారిస్తే ఎవరూ బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు..తప్పు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు..రాష్ట్రంలో క్రిమినల్ మాఫియా ఒకటి తయారైందని మండిపడ్డారు..వీళ్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు..సంబంధిత జిల్లాల ఇన్‌చార్జ్ మంత్రులు వారి పరిధిలోని ఎమ్మెల్యేలను పిలిపించి వెంటనే మాట్లాడాలని సూచించారు..
రోడ్డు మీద పడి దాడి చేయడం ఏమిటి:- సీఎం నివాసంలో మంత్రి నారా లోకేష్ ఇచ్చిన ఆల్పహర విందుకు మంత్రులు హజరు కాగా వారితో మాట్లాడుతూ సందర్బంలో ఏడుగురు ఎమ్మెల్యేలు వ్యవహారించిన తీరుపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి విషయం మంత్రులు లోకేష్ దగ్గర ప్రస్తావించగా,, ఇలా రోడ్డు మీద పడి దాడి చేయడం ఏమిటని లోకేష్ ప్రశ్నించారు.. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే సహించేది లేదని హెచ్చరించారు.. =
లేడీ డాన్ ఎమ్మెల్యే సునీల్ పేరు:- లేడీ డాన్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని,,పెరోల్ ఇచ్చే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని హోంమంత్రి వంగలపూడి అనితకి సూచించారు..ఎమ్మెల్యేలు పెరోల్ కోసం సిఫార్సు చేసిన విషయాన్ని లోకేష్ ప్రస్తావించారు.. నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే సునీల్ పేరును లోకేష్ ప్రస్తావించారు.. అందుకనే ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని మార్గనిర్దేశం చేశారు.