2026 మార్చి నాటికి అధికారులు,ఉద్యోగుల కోసం 4 వేల ఇళ్లు పూర్తి చేస్తాం-మంత్రి నారాయణ
అమరావతి: ఎవరెన్ని కుట్రలు చేసినా అమరావతిని మూడేళ్లలో ఖచ్చితంగా పూర్తిచేసి తీరుతామని మంత్రి నారాయణ స్పష్టం చేసారు… అసలు అమరావతిలో పనులే జరగడం లేదని ఆరోపణలు చేస్తున్న వారు క్షేత్రస్థాయికి వచ్చి చూడాలని సూచించారు…రాజధాని నిర్మాణ పనులను మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.శాఖమూరు రిజర్వాయర్,కొండవీటి వాగు,గ్రావిటీ కెనాల్ తో పాటు అనంతవరం పార్కు పనులు పరిశీలించిన అనంతంర మంత్రి మాట్లాడుతూ పాత నిర్మాణాలపై ఐఐటీ నిపుణులతో అధ్యయనం చేసి ముందుకెళ్తున్నామన్నారు. వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకు అధికారులు,ఉద్యోగులకు సంబంధించి 4 వేల ఇళ్ల నిర్మాణం పూర్తిచేస్తామని తెలిపారు.ఇదే సమయంలో రోడ్లు,డ్రైనేజి పనులు కూడా దాదాపు పూర్తికావచ్చినట్లు చెప్పారు. వర్షాల కారణంగా కాలువల పనులు కొంచెం నెమ్మదిగా సాగుతున్నాయన్నారు..2027 అక్టోబర్ లోగా ఆయా పనులు పూర్తిచేయాలని టార్గెట్ పెట్టుకున్నప్పటికీ వచ్చే ఏడాది చివరకు పూర్తిచేసేలా వేగంగా పనులు జరుగుతున్నాయని మంత్రి నారాయణ చెప్పారు.

