ఇంటి చిరునామాకు గుర్తులుగా చెట్ల పేర్లు చెప్పేవాళ్లం-ఉప ముఖ్యమంత్రి
అమరావతి: మా చిన్ననాటి కాలంలో మిత్రులకు ఇంటి చిరునామా చెప్పేటపుడు గుర్తులుగా చెట్ల పేర్లు చెప్పేవాళ్లమని,,మా ఇంటి ముందు ఫలానా చెట్టు ఉంటుందనో, వారి ఇంటి ముందు గోరింటాకు చెట్టు అంటూ ఆనవాళ్లు చెప్పేవాళ్లం.. మనిషికి ఆనవాళ్లు చెట్లు, వృక్షాలే… వాటితో మన జీవనం.. జీవితం ముడిపడి ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు..గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతం అనంతవరంలోని ఏడీసీఎల్ పార్క్ లో మొక్కలు నాటిన అనంతరం వన మహోత్సవ సభలో ప్రజలను ఉద్దేశించి డిప్యూటీ సీఎం నా వ్యక్తిగత జీవితంలో ఇప్పటి వరకు పర్యావరణాన్ని పెంపొందించే దిశగా పలు కార్యక్రమాలు చేశానని, ఇక మీదట దాన్ని సమాజం మొత్తానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దుతానని చెప్పారు.

ఈ ఒక్క రోజే కోటి మొక్కలు నాటడం… వచ్చే ఏడాదికల్లా అయిదు కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ‘‘చెట్టు మనకు ఆధారం… చెట్లు లేని భూమిని ఊహించలేము… నల్లమల అటవీ పరిరక్షణ కోసం మూడు దశాబ్దాలుగా అలుపెరగకుండా పని చేస్తున్న కొమ్మిర అంకారావు లాంటి వ్యక్తి జీవితం భావితరాలకు స్ఫూర్తివంతం...అంకారావు గురించి తెలుసుకున్న కొద్దీ మరింత ఆసక్తిని కలిగిస్తుంది.. పర్యావరణం, మొక్కల పెంపకం, అడవుల్ని సంరక్షించుకోవడం అనేది మనిషి ప్రాథమిక బాధ్యత అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.. నేను ప్రతిసారి వ్యక్తిగతంగా పర్యావరణం గురించి చాలా పనులు చేశాను. ఇక వచ్చే ఏడాది ఇదే సమయానికి అయిదు కోట్ల మొక్కల పెంపకం అనేది లక్ష్యంగా పెట్టుకొని పని చేస్తాను..ఆ అనుభవాలను వచ్చే ఏడాది మీ అందరి ముందు పంచుకుంటాను.. కార్చిచ్చులు ఆపేందుకు గొర్రెల కాపర్లకు తగిన అవగాహన సదస్సులు నిర్వహిస్తాం.. వాటిని నివారించేలా ప్రణాళికతో ముందుకు వెళతామని అన్నారు..ఈ కార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి పొంగూరు నారాయణ, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్, కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ కృష్ణయ్య, అమరావతి డవలప్మెంట్ బోర్డు ఛైర్మన్ లక్ష్మీ పార్థసారధి, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాము, పీసీసీఎఫ్ ఎ.కె.నాయక్, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.

