AP&TG

ప్లాస్టిక్‌ రహిత సమాజం కోసం పౌరులను భాగస్వామ్యం చేస్తున్నాం-డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌

అమరావతి: ప్లాస్టిక్‌ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం కృషి చేస్తున్నమని,, ప్లాస్టిక్‌ వ్యర్థాల నియంత్రణకు త్వరలో యాక్షన్ ప్లాన్ తీసుకొస్తామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ స్పష్టం చేశారు.. శుక్రవారం అసెంబ్లీలో ప్లాస్టిక్ వినియోగంపై సభ్యులు అడిగిన ప్రశ్నకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమాధానం ఇచ్చారు.. ప్లాస్టిక్‌ రహిత సమాజం కోసం పౌరులను భాగస్వామ్యం చేస్తున్నామని,,అయితే పాస్టిక్ నియంత్రణకు ముందుకు రావాలంటూ ఈ సందర్భంగా ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు..  సందర్భంలో పవన్ కళ్యాన్ మాట్లాడుతూ,,మన జీవితాల్లో ప్లాస్టిక్ ఒక భాగం అయిపోయిందని,,ఈ విపత్తు నుంచి బయట పడేందుకు ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తామని తెలిపారు..

తిరుమలలో ప్లాస్టిక్‌ నిషేధాన్ని క్రమశిక్షణతో అమలు అవుతుందని గుర్తు చేశారు.. ప్లాస్టిక్‌ నియంత్రణ అనేది రాజకీయ నేతల నుంచే ప్రారంభం కావాలని ఆయన ఆకాంక్షించారు.. ఏ చిన్న కార్యక్రమం అయినా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని,,ఇదే సమయంలో ఫ్లెక్సీల వాడకం విచ్చలవిడిగా పెరిగి పోయిందంటూ ఆందోళన వ్యక్తం చేశారు..

బయో డీగ్రేడబుల్ తయారీ:- ఒక్క సారి వాడిన ప్లాస్టిక్‌ను నియంత్రించడానికి ఇప్పటికే జిల్లా కలెక్టర్‌లకు తగు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.. సచివాలయంలో ప్లాస్టిక్ ఫ్రీగా ప్రకటించామని,,దింతో గాజు బాటిళ్లలో నీరు ఇస్తున్నారని వివరించారు.. రాష్ట్ర ప్రభుత్వం సర్కులర్ ఎకానమీలో భాగంగా పార్కులు, ప్లాస్టిక్ రీ సైకిలింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు.. బయో డీగ్రేడబుల్ తయారీ పరిశ్రమలను ప్రోత్సాహిస్తున్నామని,,ఇందుకు సంబంధించి క్రియాశీలక పాత్ర పోషించాలంటూ పౌరులకు ఆయన సూచించారు..

పసికందుల రక్తంలోకి:- ప్లాస్టిక్.. భూమిలో కలసిపోవడానికి 300 ఏళ్లు పడుతుందన్నారు.. పశువుల కడుపులోకే కాదు,, పసికందుల రక్తంలో కూడా ఇది కలిసి పోతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.. ప్లాస్టిక్ మైక్రో, న్యానో ప్లాస్టిక్ రూపంలో ఉండి పోతున్నాయని,,ఈ పరిస్థితిని నివారించేందుకు రెండు మూడు నెలల్లో డీటెయిల్డ్ ప్లాన్‌ రూపోందిస్తున్నామని వివరించారు.. నిర్మల్ గ్రామ పురస్కారం తరహలో ప్లాస్టిక్ రహిత గ్రామాలకు ఇన్సెంటీవ్ ఇస్తామని ప్రకటించారు..వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో పర్యావరణం, కాలుష్యంపై ప్రత్యేక చర్చ జరుగుతుందని తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *