AP&TGNATIONALOTHERSTECHNOLOGY

PSLV-C62-64వ మిషన్ ప్రయోగం విజయవంతం అయ్యిందా?

నెల్లూరు: ఇస్రోకు నమ్మకమైన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV-C62) రాకెట్ లోని మూడవ దశలో కీలకమైన సౌంకేతిక సమస్య తలెత్తింది. సోమవారం ISRO సౌంకేతిక పరమైన ఎదురుదెబ్బ తగిలింది. దీంతో PSLV మోసుకుని వెళ్లిన మొత్తం 16 శాటిలైట్లను నిర్దేశించి కక్ష్యలోకి ప్రవేశ పెట్టిందా? లేదా అనే విషయంపై స్పష్టత రాలేదు.?

44.4 మీటర్ల పొడవైన PSLV  సోమవారం ఉదయం 10.18 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి భూమి పరిశీలన ఉపగ్రహం-EOS-N1 (అన్వేష)-అలాగే భారతదేశం,విదేశాలకు సంబంధించి మరో 15 శాటిలైట్స్ ను మోసుకెళ్లింది. 17 నిమిషాల్లో రాకెట్ వాటిని 512 కిలోమీటర్ల సూర్య-సమకాలిక కక్ష్యలో ప్రవేశ పెట్టాల్సి ఉంది.

ప్రయోగం సజావుగా ప్రారంభమైంది.ఇస్రో ప్రత్యక్ష ప్రసారంలో రాకెట్ 1-2 దశల ద్వారా సాధారణంగా పనిచేస్తుంది.3వ దశ ప్రణాళిక ప్రకారం మండింది. రాకెట్ మూడవ దశ చివరిలో స్ట్రాప్-ఆన్ మోటార్లు థ్రస్ట్ అందిస్తున్న సమయంలో ఇబ్బంది ప్రారంభమైందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ అన్నారు.3వ దశ ముగిసే సమయానికి వాహనంలో మరింత సౌంకేతిక సమస్యలు రావడంతో రాకెట్ ప్రయాణిస్తున్న మార్గంలో తేడా జరగడం గమనించమని” అని నారాయణన్ అన్నారు. ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ మాట్లాడుతూ డేటాను విశ్లేషిస్తున్నామని, అంతరిక్ష సంస్థ వీలైనంత త్వరగా వివరాలను పంచుకుంటుందని, మిషన్ విజయవంతమైందా లేదా విఫలమైందా అనే విషయం త్వరలోనే ప్రకటిస్తామన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *