గ్రామ సచివాలయాల పేరును ‘విజన్ యూనిట్’గా మార్పు-సీ.ఎం చంద్రబాబు
వన్ విజన్-వన్ డైరెక్షన్… ఇదే ప్రభుత్వ విధానం..
అమరావతి: గ్రామ సచివాలయాల పేరును ‘విజన్ యూనిట్’గా మారుస్తున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.గురువారం సచివాలయంలో మంత్రులు, జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. శాఖలవారీగా లక్ష్యాలు, సాధించిన అభివృద్ధిపై సమీక్షించారు. గ్రామ సచివాలయాన్ని విజన్ యూనిట్‌గా మార్చి సమర్థంగా వినియోగించుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు..”డేటా -డ్రివెన్ గవర్నెన్స్-పాలనలో టెక్నాలజీ-RTGSతో సమన్వయంపై సచివాలయంలో మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “సాంకేతికత ద్వారా ప్రజలకు సుపరిపాలన అందించాలని,, గ్రామ సచివాలయాన్ని విజన్ యూనిట్‌గా మార్చి సమర్థం వంతంగా వినియోగించుకోవాలన్నారు..ఇటీవల తుపానులో సాంకేతికతతో ప్రాణ, ఆస్తి నష్టం తగ్గించగలిగాం,,అలాగే డేటా ఆధారిత పాలన అత్యంత కీలకమైన అంశంగా మారిందని,,రోడ్డు ప్రమాదాలు జరగకుండా టెక్నాలజీని వినియోగించాలన్నారు..ఇటీవల జరిగిన ప్రమాదాల్లో చాలా ప్రాణ నష్టం జరిగిందని,, బాధితులకు త్వరితగతిన సాయం అందేలా చూడాలి” అని స్పష్టం చేశారు.
డేటా ఆధారిత పాలనా:- వన్ విజన్-వన్ డైరెక్షన్… ఇదే ప్రభుత్వ విధానమని.. దీనికి అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం పని చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశా నిర్దేశం చేశారు. స్వర్ణాంధ్ర-2047 విజన్ దిశగా ప్రభుత్వ యంత్రాంగం పని చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాలు విజన్ యూనిట్లుగా పని చేయాలని దిశా నిర్దేశం చేశారు.
సమాచార సేకరణ-క్రోడీకరణతో మెరుగైన సేవలు:- “ప్రస్తుతం రియల్ టైమ్ గవర్నెన్స్ కాలం నడుస్తోంది. సిటిజెన్ డేటా అంతా క్రోడీకరించాం. అంగన్‌వాడీల స్థాయి నుంచే విద్యార్ధుల డేటా అనుసంధానం కావాలి. అవేర్ ద్వారా విస్తృతమైన డేటాను సమన్వయం చేసుకుని వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు డేటా లేక్ వ్యవస్థను ఏర్పాటు చేశాం. దీని ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన సమాచారం ఒక్క చోటే క్రోడీకరించి త్వరితగతిన
పారదర్శకత పాటించాలి… ప్రజలకు వాస్తవాలు చెప్పాలి:- “గత పాలకుల వల్ల 22ఏ లాంటి వివాదాలు పెద్ద ఎత్తున తలెత్తాయి. రికార్డులు కూడా తారుమారు చేశారు. వాటిని పరిష్కరించే విషయంలో యంత్రాంగం అత్యంత భాద్యతగా వ్యవహరించాలి. అలాగే ఎక్సైజ్ శాఖలోనూ గత ప్రభుత్వంలో తీవ్రమైన అవకతవకలు జరిగాయి. వాటన్నిటినీ సరిచేస్తుంటే మళ్లీ మనపై ఆరోపణలు గుప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు.
టెక్నాలజీ వినియోగంతో ఖర్చులూ తగ్గించవచ్చు:- “నీటి వనరుల విషయంలోనూ రియల్ టైమ్‌లోనే నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాం. రీఛార్జి చేయటంతో పాటు భూగర్భజలాలను పెంచుకుంటే కరవు అనే పరిస్థితే ఉండదు. ఉచిత విద్యుత్ నిమిత్తం రైతులకు రూ.9 వేల కోట్ల సబ్సీడీ ఇస్తున్నాం. భూగర్భజలాలు పెరిగితే విద్యుత్ వినియోగం తగ్గి రూ.4500 కోట్ల వ్యయం తగ్గించుకోవచ్చు. అలాగే వైద్యారోగ్య శాఖలోనూ వనరుల సమర్ధ నిర్వహణ ద్వారా ప్రిడిక్టివ్ అనాలసిస్ ద్వారా వ్యయాన్ని గణనీయంగా తగ్గించుకునే అవకాశం ఉంది. అప్పుడు డేటానే మనకు అద్భుతమైన సంపదగా మారుతుందన్నారు.

