AP&TGMOVIESOTHERS

మూడు ముళ్ల బంధంతో ఒకటైయిన విజయ్‌, రష్మికలు

హైదరాబాద్: టాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నలు మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. గత కొంతకాలంగా వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ, గురువారం ఉదయం 10.10 గంటలకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ వేదికగా రష్మిక మెడలో విజయ్‌ మూడుముళ్లు వేశారు. ఈ వివాహ వేడుక రెండు భిన్న సంస్కృతుల కలయికగా వైభవంగా జరుగుతున్నట్లు తెలుస్తొంది. ఉదయం విజయ్‌ కుటుంబ సంప్రదాయం ప్రకారం హిందూ పద్ధతిలో పెళ్లి వేడుక పూర్తికాగా, సాయంత్రం 4.30 గంటలకు రష్మిక కుటుంబ ఆచారాల (కడువ) ప్రకారం మరోసారి వివాహం జరగనుంది. ఉదయ్‌పూర్‌లో సన్నిహితుల మధ్య జరిగిన ఈ వివాహం అనంతరం, మార్చి 4వ తేదీన హైదరాబాద్‌లో సినీ ప్రముఖులు, రాజకీయ నేతల కోసం భారీ వెడ్డింగ్‌ రిసెప్షన్‌ను ఏర్పాటు చేయనున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *