ఆంధ్రప్రదేశ్ ఆర్టీఐ చీఫ్ కమిషనర్‌గా వజ్జా శ్రీనివాసరావు నియామకం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర సమాచార కమిషన్‌లో కొత్త సభ్యులను నియమిస్తూ విజయానంద్ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. RTI చీఫ్ కమిషనర్‌గా వజ్జా శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. వి.శరత్‌చంద్ర కల్యాణ చక్రవర్తి,, గాజుల ఆదెన్న, ఒంటేరు.రవిబాబు, పరవాడ సింహాచలం నాయుడు కమిషనర్లుగా నియమితులయ్యారు. నలుగురు కమిషనర్లలో ఒక పాత్రికేయుడు, ముగ్గరు న్యాయవాదులకు అవకాశం కల్పించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, ఈ కమిషనర్లు మూడేళ్ల సర్వీస్ పూర్తి చేసే వరకు లేదా 65 ఏళ్ల వయస్సు చేరేవరకు ఆర్టీఐ కమిషనర్లుగా పదవిలో కొనసాగుతారు. ఈ నియామకాలు రాష్ట్రంలో సమాచార హక్కుల అమలుకు మరింత స్థిరత్వాన్ని అందించనున్నాయి.

