కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని హైవే మ్యాన్ ఆప్ ఇండియాగా పిలుస్తారు-ఉప ముఖ్యమంత్రి పవన్
అమరావతి: భారత్ ఐక్యతకు,అభివృద్దికి,దేశ ప్రగతికి చిహ్నలు రహదారుఅ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు..శనివారం మంగళగిరి CK కన్వెన్షన్ సెంటర్‌లో పలు జాతీయ రహదారులకు కేంద్రమంత్రి శంకుస్థాపన చేశారు..ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్,తదితరులు పాల్గొన్నారు..ఈ సందర్బంలో సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ రహదారుల శంకుస్థాపనతోనే మెరుగైన పూనాది ఏర్పాడుతుందన్నారు..కనీసం 15 సంవత్సరాలు ఈ కూటమి చాలా బలంగా ఉండాలని ఉద్ఘాటించారు..మన కూటమి ఐక్యతను దెబ్బతీయడానికి వైసీపీ నేతలు ఎంతో ప్రయత్నం చేస్తారని,,మనం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు..
కూటమిలో ఉన్న మూడు పార్టీల్లోని నేతలు, కార్యకర్తలకు చిన్నచిన్న పొరపచ్చాలు వస్తున్న మీ స్ధాయిలోనే పరిష్కరించుకొని ముందుకెళ్లాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు..అభివృద్ధిలో వెనుకబడ్డ ఆంధ్రప్రదేశ్ తిరిగి ముందుకు వెళ్లే ప్రయత్నం చేయాలని ఆకాంక్షించారు..తమ ఈ ప్రయత్నం వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని స్పష్టం చేశారు..నేడు రోడ్లు వేయడమంటే,,భారత భవిష్యత్తుకు బలమైన పునాదని పవన్ కల్యాణ్ అభివర్ణించారు..స్వర్ణ చతుర్భుజి (గోల్డెన్ క్వార్డలేటర్) ద్వారా రహదారులు,, దేశ దశదిశను దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పాయి మార్చారని కొనియాడారు.. భారతదేశం ఎదుగుదలకు అసలైన బలం మౌలిక వసతులని,,దీనికి ప్రధాన కారణం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు..
రోడ్ల నిర్మాణ వేగం మూడు రెట్లు పెరిగింది:- 2014లో దేశంలో జాతీయ రహదారులు 91 వేల కిలోమీటర్లు ఉండగా,,నేడు అవి లక్షా 40 వేల కిలోమీటర్లకు చేరిందని తెలిపారు..నిర్మాణ వేగం మూడు రెట్లు, బడ్జెట్ ఆరురెట్లు పెరిగిందని వెల్లడించారు..వేగంగా రహదారులు నిర్మాణం అయ్యేందుకు ప్రధాన కారణం కేంద్ర రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ అని,,అందుకే అయన్ను హైవే మ్యాన్ ఆప్ ఇండియాగా పిలుస్తారని ప్రశంసించారు..గత జగన్ ప్రభుత్వానికి కేంద్రప్రభుత్వం నుంచి సహకారం వచ్చినా సరైన విధంగా స్పందించలేదని పవన్ కల్యాణ్ మండిపడ్డారు..
డోలీ మోతలు లేకుండా చేశాం:- ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.550 కోట్లు ఇస్తే ఏపీ ప్రభుత్వం రూ.50 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయడంతో రవాణా సదుపాయం లేని ఏజెన్సీ ప్రాంతాలను రోడ్లతో కలుపుతున్నామని,,అక్కడ డోలీ మోతలు లేకుండా చేశామని తెలిపారు.. గత జగన్ ప్రభుత్వాన్ని చూశామని,,ప్రజావేదిక కూల్చివేతలతో ఆ ప్రభుత్వం మొదలైందని,,కనీసం రోడ్లుపై ఏర్పడిన గుంతలు కూడా పూడ్చలేదని విమర్శించారు..కూటమి ప్రభుత్వంలో ప్రస్తుతం రాష్ట్ర రహదారులు,,జాతీయ రహదారుల నిర్మాణలు వేగంగా నిర్మిస్తున్నామని పవన్ కల్యాణ్ తెలిపారు.

