AP&TGDEVOTIONALOTHERS

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్

తిరుమల: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు.  టీటీడీ నూతన ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అడిషనల్ ఈ ఓ వెంకయ్య చౌదరి కేంద్ర ఆర్థికశాఖ మంత్రికి  శ్రీవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. సూళ్లూరుపేట ఆర్డీవో కిరణ్మయి కేంద్ర మంత్రి వెంట ఉన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *